Bharat Ratna Award 2024: 15 రోజుల్లో ఐదుగురికి భారతరత్న.. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్..!
ABN , First Publish Date - 2024-02-09T15:10:53+05:30 IST
PV Narsimha Rao Chaudary Charan Singh MS Swamynathan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చాలా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విపక్షాల వైపు ప్రజల దృష్టి మళ్లకుండా.. తనదైన వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్డీయే సర్కార్. ఇప్పటికే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో ఎంతో కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన మోదీ సర్కార్..
PV Narsimha Rao Chaudary Charan Singh MS Swamynathan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చాలా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విపక్షాల వైపు ప్రజల దృష్టి మళ్లకుండా.. తనదైన వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్డీయే సర్కార్. ఇప్పటికే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో ఎంతో కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన మోదీ సర్కార్.. ఇప్పుడు 15 రోజుల వ్యవధిలోనే వరుసగా ఐదుగురికి భారతరత్న ప్రకటించి యావత్ దేశ ప్రజలను తనవైపు తిప్పుకుంది. అంతేకాదు.. ఈ ప్రకటనలో దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం.
గత 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. ఈ గౌరవాన్ని అందుకుంటున్న వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు, ఒక మాజీ ఉప ప్రధాని, ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు కూడా ఉన్నారు. మరణానంతరం నలుగురికి ఈ గౌరవం ఇస్తున్నారు. ఈ ఐదుగురి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును శుక్రవారం నాడు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతకు ముందు లాల్ కృష్ణ అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు భారతరత్న ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారతరత్న అవార్డులకు సంబంధించి చరిత్ర చూసుకుంటే వివరాలు ఇలా ఉన్నాయి..
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం1999లో అత్యధికంగా నలుగురు ప్రముఖులకు భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఒక సంవత్సరంలో నలుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించడం అదే ఆధిక్యం. ఆ సంవత్సరంలో జయ ప్రకాష్ నారాయణ్, ఆమర్త్యసేన్, గోపీనాథ్ బోర్డోలోయ్, రవి శంకర్‌లకు ప్రదానం చేశారు. కానీ, ఇప్పుడు ఏకంగా ఐదుగురికి ప్రకటించి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది కేంద్ర ప్రభుత్వం.
భారతరత్న ఎవరికి ఇస్తారు? నిబంధనలు ఏంటి?
ఒక కేటగిరీలో ఒకేసారి ముగ్గురి కంటే ఎక్కువ మందికి భారతరత్న అవార్డు ఇవ్వడానికి అవకాశం లేదు. భారతరత్న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం, ఇది ఏ రంగంలోనైనా అసాధారణమైన, అత్యున్నత సేవలు అందించినందుకు గుర్తింపుగా ఇవ్వడం జరుగుతుంది. రాజకీయాలు, కళలు, సాహిత్యం, సైన్స్ రంగాలలో ఆలోచనాపరులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక సేవకులకు భారతరత్న అవార్డు ఇవ్వబడం జరుగుతుంది.
'భారతరత్న' అవార్డును 1954 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ వెంకట రామన్‌లకు తొలిసారిగా 1954లో ఈ గౌరవం లభించింది. అయితే, తాజాగా భారతరత్న పొందిన ప్రముఖుల వివరాలు మీకోసం..
చౌదరి చరణ్ సింగ్:-
👉 ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నూర్‌పూర్‌లో 1902 డిసెంబర్ 23న జన్మించారు
👉 మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు.
👉 రైతులు, జాట్‌లకు నాయకత్వం వహించారు.
👉 1937లో చప్రౌలీ నుంచి తొలిసారిగా యూపీ శాసనసభకు ఎన్నికయ్యారు.
👉 జూన్ 1951లో రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఎన్నికయ్యారు
👉 ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
👉 3 ఏప్రిల్ 1967 నుంచి 25 ఫిబ్రవరి 1968 (భారతీయ క్రాంతి దళ్) - సుమారు 11 నెలలు.
👉 18 ఫిబ్రవరి 1970 నుండి 1 అక్టోబర్ 1970 (భారతీయ క్రాంతి దళ్) - సుమారు 7 నెలలు.
👉 భారత ప్రధాన మంత్రిగా చేశారు.
👉 28 జూలై 1979 నుంచి 14 జనవరి 1980 వరకు జనతా పార్టీ ప్రభుత్వంలో సుమారు 5 నెలల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు.
👉 కాంగ్రెస్, జనతాదళ్, భారతీయ క్రాంతిదళ్, లోక్‌దళ్‌తో అనుబంధం ఉంది
👉 చౌదరి చరణ్ సింగ్ 29 మే 1987న మరణించారు
👉 వ్యవసాయ సంఘాలతో చరణ్ సింగ్‌కు జీవితకాల అనుబంధం కారణంగా న్యూఢిల్లీలోని ఆయన స్మారకానికి కిసాన్ ఘాట్ అని పేరు పెట్టారు.
పి.వి.నరసింహారావు:-
👉 1921 జూన్ 28న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లో జన్మించారు
👉 ఉస్మానియా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, నాగ్‌పూర్ యూనివర్సిటీల్లో చదివారు
👉 పి.వి. నరసింహారావుకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు
👉 వ్యవసాయ నిపుణుడు, వృత్తిరీత్యా న్యాయవాది అయిన పీవీ నరసింహారావు ఆ తరువాత కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
👉 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1962 నుండి 64 వరకు సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.
👉 1964 నుండి 67 వరకు న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు.
👉 1967లో ఆరోగ్య, వైద్య శాఖ మంత్రిగా పని చేశారు.
👉 1968 నుంచి 1971 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు
👉 1971 నుండి 73 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
👉 1975 నుండి 76 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
👉 1968 నుండి 1974 వరకు ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు.
👉 1972 నుండి మద్రాసు దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.
👉 1957 నుండి 1977 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడుగా ఉన్నారు.
👉 1977 నుండి 84 వరకు లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు.
👉 డిసెంబర్ 1984లో రామ్‌టెక్ నుంచి ఎనిమిదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
👉 14 జనవరి 1980 నుండి 18 జూలై 1984 వరకు కేంద్ర విదేశాంగ మంత్రిగా పని చేశారు.
👉 19 జూలై 1984 నుండి 31 డిసెంబర్ 1984 వరకు హోం మంత్రిగా పని చేశారు.
👉 31 డిసెంబర్ 1984 నుండి 25 సెప్టెంబర్ 1985 వరకు రక్షణ మంత్రిగా పని చేశారు.
👉 5 నవంబర్ 1984 నుండి ప్రణాళిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహించారు.
👉 25 సెప్టెంబర్ 1985 నుండి మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశారు.
👉 పీవీ నరసింహారావుకు సంగీతం, సినిమా, నాటక రంగాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది.
ఎంఎస్ స్వామినాథన్:-
👉 భారతదేశంలో హరిత విప్లవ పితామహుడుగా గుర్తింపు పొందించారు ఎంఎస్ స్వామినాథన్.
👉 ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుండి 81 గౌరవ డాక్టరేట్ డిగ్రీలను అందుకున్నారు
👉 2007-13 కాలానికి రాజ్యసభవ సభ్యులుగా పని చేశారు.
👉 స్వామినాథన్ అందుకున్న ఇతర అవార్డులు..
👉 1971లో కమ్యూనిటీ లీడర్‌షిప్ కోసం రామన్ మెగసెసే అవార్డు
👉 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు
👉 1987లో మొదటి ప్రపంచ ఆహార బహుమతి
👉 2007లో లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు
👉 పద్మశ్రీ (1967)
👉 పద్మ భూషణ్ (1972)
👉 పద్మవిభూషణ్ (1989)