Home » Bhatti Vikramarka Mallu
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు(గురువారం) పరిశీలించారు.
పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం..
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతురుణమాఫీని ఆగస్టు 15లోగా చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.
రాష్ట్ర ఆదాయం పెంపునకు మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా శాఖలు, ఆరోగ్యశ్రీ విభాగంపై శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
LRSపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనను ఆశీర్వదిస్తూ 8 లోక్‌సభ స్థానాలతో పాటుగా కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గాంధీభవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్ యాద వ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.