Share News

18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం?

ABN , Publish Date - Jun 10 , 2024 | 05:25 AM

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ క్యాబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతురుణమాఫీని ఆగస్టు 15లోగా చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం?

  • రైతు రుణమాఫీపై చర్చించే అవకాశం

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ క్యాబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతురుణమాఫీని ఆగస్టు 15లోగా చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.


వాస్తవానికి గత నెల్లో లోక్‌సభ ఎన్నికలు ముగియగానే క్యాబినెట్‌ భేటీ కావాలని నిర్ణయించింది. ఎన్నికల్‌ కోడ్‌ అమల్లో ఉన్నందున తొలుత ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఆ తర్వాత అనుమతి వచ్చినా కేవలం అత్యవసర అంఽశాలకు సంబంధించి చర్చించాలని ఈసీ ఆదేశించింది. దాంతో మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలేవీ తీసుకోలేదు. ప్రస్తుతం కోడ్‌ ముగియడంతో పాటు పాలనపై పూర్థిస్థాయిలో దృష్టిసారించాలని రేవంత్‌ సర్కారు భావిస్తోంది.

Updated Date - Jun 10 , 2024 | 05:25 AM