Home » Bhuvaneswari
Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర పూర్తి అయ్యింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవారి యాత్ర ముగిసింది.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపుకు వచ్చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న 'నిజం గెలవాలి' ముగింపు సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్‌తో మనస్థాపం చెందిన కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇప్పటి వరకు భువనమ్మ 8,500 కిలోమీటర్లు ప్రయాణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందజేశారు.
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. అక్రమ దారిలో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జిల్లా పర్యటన కొనసాగుతోంది. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. వైసీపీ రాక్షసపాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రంగంలో మహిళలు చంద్రన్న రాజ్యంలోనే అభివృద్ధి చెందుతారని నారా భువనేశ్వరి అభిప్రాయ పడ్డారు. లక్షలాది మంది పసుపు సైన్యం సైకిల్ మీద కదం తొక్కాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జెండా పైకి ఎగురవేసి నిజం గెలిపిద్దాం అని కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో ఆకస్మికంగా మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబాన్ని గురువారం నాడు భువనేశ్వరి పరామర్శించారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మరోసారి ‘‘నిజం గెలవాలి’’ యాత్రతో పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను భువనమ్మ పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు.
Telangana: జిల్లాలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈరోజు పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించి టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మనస్థాపం చెంది మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం అందజేస్తున్నారు.
జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక.. కళ్యాణదుర్గం రూరల్ మండలం ముద్దినాయనపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీరాములు (65).. 11-09-2023న మృతి చెందారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనంతపురం నియోజకవర్గం, అనంతపురం టౌన్ 28వ డివిజన్లో పార్టీకార్యకర్త డేరంగుల వెంకటమ్మ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. అరకు పర్యటనలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అరకు కాఫీ తాగుతున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.