Bhuvaneshwari: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భువనమ్మ ఏం చెప్పారంటే?
ABN , Publish Date - Jul 25 , 2024 | 02:01 PM
Andhrapradesh: జిల్లాలోని కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకు వచ్చిన భువనమ్మ... అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ... ప్రజల కోసం, టీడీపీ కార్యకర్తల కోసం ప్రజా క్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
చిత్తూరు, జూలై 25: జిల్లాలోని కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (CM Chandrababu Wife Bhuvaneshwari) పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకు వచ్చిన భువనమ్మ... అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ... ప్రజల కోసం, టీడీపీ కార్యకర్తల కోసం ప్రజా క్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు ప్రతి ఒక్కరూ కోల్పోయిన స్వాతంత్రం కోసమే ఈ ఎన్నికల్లో కూటమికి అఖండ మెజారిటీని ఇచ్చారన్నారు. అసెంబ్లీ అన్నది దేవాలయం లాంటిదని.. అలాంటి దేవాలయంలో ఒక స్త్రీ గురించి మాట్లాడిన తీరు చాలా బాధేసిందన్నారు.
YS Jagan: పోలవరం జాప్యానికి జగన్ కారణం.. పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రం
ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో బూతుల పురాణంతో అపవిత్రం చేశారని మండిపడ్డారు. కూటమి పాలనలో అసెంబ్లీ హుందాతనంలో నడుస్తోందన్నారు. ప్రజా సమస్యలపై పరిష్కారం దిశగా కూటమి ముందుకు పోవడం ఖాయమన్నారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి తాను రావడానికి ప్రధాన కారణం వైసీపీ అరాచక పాలనే అని చెప్పుకొచ్చారు. మహిళలు చంద్రబాబుపైన నమ్మకంతో ఆయనను గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నెరవేరుస్తారని స్పష్టం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు. ప్రజల సుఖదుఃఖాలు పాలుపంచుకుంటా అని భువనేశ్వరి పేర్కొన్నారు.
KCR: ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్
కాగా.. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నసమయంలో భువనేశ్వరి తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో అనేక మంది కార్యకర్తలు బాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మరణించారు. దీంతో ఆయా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించిన భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. విడతలవారీగా పలు నియోజకవర్గాల్లో తిరుగుతూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. వారికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆయా కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం కూడా భువనేశ్వరి అందజేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
AP Assembly: టీడీఆర్ బాండ్లపై ఏపీ అసెంబ్లీలో చర్చ...
Pawan Kalyan: దేశంలోనే ఈవేస్ట్‌లో ఏపీ 12వ స్థానం
Read Latest AP News And Telangana News