AP Politics:వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైంది: కేశినేని చిన్ని విసుర్లు
ABN , Publish Date - Apr 13 , 2024 | 06:36 PM
వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని విమర్శించారు. రాష్ట్రం మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. కౌరవ సభను గౌరవ సభగా చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన శపథాన్ని గుర్తుచేశారు. అలా జరగాలంటే టీడీపీ, బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
విజయవాడ: వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని (Kesineni Chinni) విమర్శించారు. రాష్ట్రం మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. కౌరవ సభను గౌరవ సభగా చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) చేసిన శపథాన్ని గుర్తుచేశారు. అలా జరగాలంటే టీడీపీ, బీజేపీ జనసేన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. తిరువూరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి సభ జరిగింది. ఆ సభలో కేశినేని చిన్ని మాట్లాడారు. వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
AP Election 2024: అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణీ నారా భువనేశ్వరిపై కేశినేని చిన్ని ప్రశంసలు కురిపించారు. భువనేశ్వరి నిరాడంబరంగా ఉంటారని వివరించారు. ముఖ్యమంత్రి కూతురిగా, సీఎం భార్యగా ఏ రోజు దర్పం ప్రదర్శించలేదని తెలిపారు. భువనేశ్వరి రెండు రోజులు తిరువూరు నియోజకవర్గంలో పర్యటించడం మన అదృష్టం అని పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంతో 203 మంది కార్యకర్తలు గుండెపోటుతో చనిపోయారని కేశినేని చిన్ని గుర్తుచేశారు. ఆ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి అండగా నిలిచారని గుర్తుచేశారు.
Purandeswari: ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి లేఖ.. కారణమిదే..?
రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంటే వచ్చి ఆదుకునేది ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక్కటేనని కేశినేని చిన్ని వివరించారు. ఆ ట్రస్ట్ వ్యవహారాలు చూస్తుంది భువనేశ్వరి అని తెలిపారు. భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని తన కుటుంబ సభ్యులను కోరతానని వివరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం