Home » Bihar
మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నోరుజారారు.
ఎన్నికల ప్రచార ఉధృతితో ఆరితేరిన నేతలు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారంనాడు పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సరిగ్గే ఇలాగే తడబడ్డారు. నరేంద్ర మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్ష నేతలను ఉద్దేశించిన చేసిన 'ముజ్రా' డాన్స్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్ ప్రజలను మోదీ అవమానిస్తున్నారని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో విపక్షలపై నిప్పులు చెరుగుతున్నారు. బీహార్‌లోని పాటలిపుత్రలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో 'ఇండియా' కూటమి ముస్లిం ఓట్ బ్యాంకు కోసం బానిసత్వం చేస్తోందని, 'ముజ్రా' డాన్స్ ఆడుతోందని వ్యాఖ్యానించారు. కాగా, పీఎం 'ముజ్రా' వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఘాటుగా స్పందించారు.
సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో బిహార్‌లోని 8 కీలక పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 86 మంది పోటీలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల దృష్టి యూపీ, బీహార్‌పైనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. యూపీతో పోలిస్తే బీహార్ రెండు కూటములకు కీలకంగా మారింది.
విపక్ష పార్టీల సారథ్యంలోని 'ఇండియా' కూటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. 21వ శతాబ్దపు భారతదేశాన్ని 'ఇండి' కూటమి పాపాలు ముందుకు తీసుకువెళ్లలేవని అన్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడమే ఉపాధ్యాయుల ప్రధాన ధర్మం. అయితే.. ఒక్కోసారి టీచర్లు తమ విధులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన వారికి లేనిపోని సమస్యలు తీసుకొస్తుంటాయి.
జీవితమంటేనే నిత్య పోరాటం. సమస్యలు, సవాళ్లు అందులో భాగం. ఇది రాధాకుమారికి చిన్నప్పుడే అర్థమైంది. ఆమెది బిహార్ రాజధాని పట్నా. పుట్టుకతోనే పోలియో మహమ్మారి రాధాకుమారి జీవితాన్ని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది.