Lok Sabha Polls 2024: బీహార్‌పై మోదీ స్పెషల్ ఫోకస్.. కారణమిదేనా..?
ABN , Publish Date - May 22 , 2024 | 08:20 AM
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల దృష్టి యూపీ, బీహార్‌పైనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. యూపీతో పోలిస్తే బీహార్ రెండు కూటములకు కీలకంగా మారింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల దృష్టి యూపీ, బీహార్‌పైనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం ఎన్డీయే (NDA), ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. యూపీతో పోలిస్తే బీహార్ (Bihar) రెండు కూటములకు కీలకంగా మారింది. ఈ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీహార్‌లో ఇండియా కూటమి తరపున ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నీ తానై వ్యవహరిస్తుండగా.. ఎన్డీయే తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికల షెడ్యూల్ వెలవడిన తర్వాత, ప్రధాని మోదీ బీహార్‌లో జాముయి నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు, అప్పటి నుండి బీహార్‌లో మోదీ 12 బహిరంగ సభలు నిర్వహించారు. దీంతో బీహార్ ప్రజలకు సీఎం నితీష్ కుమార్‌పై విశ్వాసం తగ్గడంతోనే ప్రధాని మోదీ ఈ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది.
బీహార్‌లోని మోతీహరి, సివాన్‌లలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పాల్గొన్నారు. ఈ రెండు ర్యాలీలతో కలిపి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో నిర్వహించిన ఎలక్షన్ క్యాంపెయిన్ రికార్డును ప్రధాని మోదీ బద్దలు కొట్టారు. ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 12 బహిరంగ సభలు నిర్వహించారు. దీంతో పాటు పాట్నాలో రోడ్ షో చేశారు. ఇది మాత్రమే కాదు, ఒక ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా వారంలో రెండుసార్లు బీహార్‌లో రాత్రిపూట బస చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి చూస్తే బీహార్‌పై ప్రధాని మోదీ ఎంత సీరియస్‌గా ఉన్నారో తెలుస్తోంది.
PM Modi: 'ఇండి' కూటమి పాపాలతో దేశం పురోగమించ లేదు: మోదీ
మొత్తం 40 స్థానాలు..
రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2019లో 39 స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఒక సీటు దక్కగా, ఆర్జేడీ ఖాతా తెరవలేకపోయింది. ఈసారి బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వాహా, జితన్‌రామ్ మాంఝీ పార్టీలతో బీజేపీ జట్టు కట్టింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, ముఖేష్ సాహ్ని పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి. దీంతో బీహార్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో భారీగా సీట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారనే చర్చ జరుగుతోంది.
మోదీ సభలు ఇవే..
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రధాని మోదీ బీహార్‌లోని జముయిలో తన తొలి బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం ఏప్రిల్ 7న నవాడలో బహిరంగ సభ నిర్వహించారు. ఏప్రిల్ 16న గయా, పూర్నియాలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఏప్రిల్ 26న నరేంద్ర మోదీ అరారియా, ముంగేర్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మే 4న దర్భంగాలో ఎన్నికల సభ నిర్వహించగా.. మే 12న పాట్నాలో రోడ్ షో నిర్వహించారు. మే 13న హాజీపూర్, సరన్, ముజఫర్‌పూర్‌లలో జరిగిన ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. మే 21వ తేదీన సివాన్, మోతిహారిలో బహిరంగ సభలు నిర్వహించారు.
అసలు కారణం ఇదేనా..
బీహార్‌లో 2019తో పోలిస్తే ఎన్డీయే కూటమికి సీట్లు తగ్గే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. భారీగా సీట్లు నష్టపోతే కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో కనీసం 30కి పైగా సీట్లలో గెలిచేందుకు ఎన్డీయే కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీచేస్తుండటం ఇండియా కూటమికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ ఉన్నప్పటికీ.. నితీష్‌పై బీహార్ ప్రజల్లో రోజురోజుకు నమ్మకం తగ్గుతుందని.. అందుకే మోదీ బీహార్‌లో ఎక్కువ సభలు నిర్వహించాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. బీహార్ ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపారనేది జూన్4న తేలనుంది.
Lok Sabha elections 2024: ఐదో దశలో తగ్గిన పోలింగ్ శాతం.. 2019తో పోలిస్తే తగ్గిందా, పెరిగిందా?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News