Share News

PM Modi: మోదీకి వ్యతిరేకంగా ఆ పని చేసిన టీచర్.. సీన్ కట్ చేస్తే చివరికి..

ABN , Publish Date - May 20 , 2024 | 08:50 AM

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడమే ఉపాధ్యాయుల ప్రధాన ధర్మం. అయితే.. ఒక్కోసారి టీచర్లు తమ విధులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన వారికి లేనిపోని సమస్యలు తీసుకొస్తుంటాయి.

PM Modi: మోదీకి వ్యతిరేకంగా ఆ పని చేసిన టీచర్.. సీన్ కట్ చేస్తే చివరికి..

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడమే ఉపాధ్యాయుల ప్రధాన ధర్మం. అయితే.. ఒక్కోసారి టీచర్లు తమ విధులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన వారికి లేనిపోని సమస్యలు తీసుకొస్తుంటాయి. ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడు కూడా అదే పని చేసి చిక్కుల్లో పడ్డాడు. ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. దీంతో.. అతడు జైలుపాలయ్యాడు. ఈ ఘటన బిహార్‌లో (Bihar) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


హరేంద్ర రజక్ అనే వ్యక్తి బిహార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి బదులుగా ఆయన మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఉచిత రేషన్‌ పథకం కింద పేదలకు ఇస్తున్న బియ్యం తినేందుకు ఉపయోగపడట్లేదని, ఆ బియ్యం క్వాలిటీగా లేవని, కాబట్టి మోదీకి ఎవరూ ఓటు వేయొద్దంటూ.. ఆ టీచర్ తరగతి గదిలో చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేయగా.. వాళ్లంతా టీచర్‌కి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి, ఆ టీచర్‌ని అరెస్ట్ చేశారు.

చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ ఆల్‌టైం రికార్డు ఔట్

ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి (DEO) అజయ్ కుమార్ మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు హరేంద్ర రజక్ ప్రవర్తనని తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. తినేందుకు వీలుపడని బియ్యం పంపిణీ చేస్తున్నందుకు మోదీకి ఓటు వేయొద్దని ఆ టీచర్ పిల్లలకు చెప్పినట్లు వారి తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారన్నారు. విద్యార్థులు సైతం ఈ విషయాన్ని ధృవీకరించారని చెప్పారు. ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడ్డం నిషేధించబడిందని చెప్పారు. అందుకే తాము రజక్‌పై కేసు నమోదు చేశామన్నారు.

Read Latest Viral News And Telugu News

Updated Date - May 20 , 2024 | 08:50 AM