Home » BRS Chief KCR
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి 400 ఎంపీ సీట్లు వస్తే.. దేశానికి ప్రమాదమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
100 రోజుల్లో హామీల అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణాకు కేంద్రం ఏమిచ్చిందో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఒక కుటుంబ పాలన పోయి.. మరో కుటుంబ పాలన వచ్చింది ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క సీట్ కూడా గెలవదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మెజార్టీ పార్లమెంట్ స్థానాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనిలా పట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండల కేంద్రంలో రోడ్ షోలో నిర్వహించారు. ఈ రోడ్ షోలో హరీష్‌రావు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
45 ఏళ్లుగా మామ(కేసీఆర్), అల్లుడు(హరీశ్‌రావు) శనిలాగా, పాపాల బైరవుల్లా ఉమ్మడి మెదక్ ప్రజలను పీక్కుతుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు.
బడాబాయ్(మోదీ), చోటాబాయ్(రేవంత్‌రెడ్డి) కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరాోపణలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా అచ్చంగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు చెప్పే సంప్రదాయం ఉందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2012నుంచి జనాభా లెక్కలు ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు.జనాభాతో పాటు కులగణన జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
తెలంగాణలో కేసీఆర్ (KCR) ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని అన్నారు. కార్మికులను, కర్షకులను చావ గొట్టిన్నందుకా? దేనికి మోదీ దేవుడని ప్రశ్నించారు.
మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో బీజేపీ ఓబీసీ సామజిక సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రఘునందన్ రావు, బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.