Lok Sabha Elections 2024: తెలంగాణకు రేవంత్ రెడ్డి శనిలా పట్టాడు: హరీశ్‌రావు
ABN , Publish Date - May 02 , 2024 | 10:58 PM
తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనిలా పట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండల కేంద్రంలో రోడ్ షోలో నిర్వహించారు. ఈ రోడ్ షోలో హరీష్‌రావు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా: తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనిలా పట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండల కేంద్రంలో రోడ్ షోలో నిర్వహించారు. ఈ రోడ్ షోలో హరీష్‌రావు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ రోడ్‌షో లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ వచ్చాక కరువు వచ్చిందని.. మంచినీళ్ల కష్టం వచ్చిందని మండిపడ్డారు.
Lok Sabha Elections 2024: కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ మంత్రి కాపాడుతున్నారు: బండి సంజయ్
రేవంత్ ఎక్కడకి పోతే అక్కడ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని అన్నారు. మాట్లాడితే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడే తప్ప ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అంటే ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు గాలికి వదిలిసేనట్టేనా..? అని నిలదీశారు. బీజేపీయే కాదు కాంగ్రెస్ కూడా తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క బస్సు తప్ప మిగాతావన్ని తుస్సేనని దెప్పిపొడిచారు.
ఒక పార్టీ నేతమో దేవుడిని చూపించి ఓట్లు అడుగుతారని.. ఇంకొక పార్టీ నేతనేమో దేవుడిపై ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారని సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను భూమి మీదకు దించాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తేనే 6 గ్యారెంటీలపై ప్రశ్నించే అస్కారం ఉంటుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని హరీశ్‌రావు కోరారు.
AP Elections: నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?..ముద్రగడపై పృథ్వి ఫైర్
Read Latest Election News or Telugu News