Loksabha Elections 2024: బీజేపీకి వేసే ప్రతి ఓటు.. రిజర్వేషన్‌కు పోటు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - May 03 , 2024 | 08:26 PM
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి 400 ఎంపీ సీట్లు వస్తే.. దేశానికి ప్రమాదమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
పెద్దపల్లి: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి 400 ఎంపీ సీట్లు వస్తే.. దేశానికి ప్రమాదమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రామగుండంలో పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. బీఆరెస్‌కు ఈ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
IRCTC: 7 రోజులు, 6 రాత్రుల కేరళ టూర్ ప్యాకేజీ.. ఆఫర్ కొన్ని రోజులే
బీఆర్ఎస్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.సింగరేణి కార్మికుల హక్కులు కేంద్రం కాల రాస్తే.. ఈశ్వర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాము ఇంకా చావలేదని దెప్పిపొడిచారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ నడుము మాత్రమే ఇరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పాము.. పడగ మీద కొట్టాలని చెప్పారు.
తెలంగాణకు ఇచ్చిన హామీలు బీజేపీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తెలంగాణ నిధులను మోదీ గుజరాత్‌కు తరలించారని విరుచుకుపడ్డారు. దేశ ప్రధాని ఒక గుజరాత్ రాష్ట్రానికే ప్రధాన మంత్రా అని నిలదీశారు.రాజ్యాంగాన్ని మోదీ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని చెప్పుకొచ్చారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు.. రిజర్వేషన్‌కు పోటని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
AP Elections: నెల్లూరు ఎంపీగా గెలిచేదెవరు.. త్రిముఖ పోరులో పైచేయి ఎవరింటే..?
Read Latest Telangana News And Telugu News