Home » BRS first list
చాలా సామర్థ్యం, అర్హత ఉన్నకొందరికి సీట్లు దక్కకపోవడంపట్ల కేటీఆర్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే ప్రజాజీవితంలో నిరాశను కూడా ఒక ముందుడుగా తీసుకోని ముందుకెళ్లాలని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఒక పేరును ప్రస్తావించారు. ఆయనే మన్నే క్రిశాంక్ (Manne Krishank).
నాకు, నా కుమారుడికి టికెట్ ఇస్తే సరే.. లేకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయ్.. మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) బట్టలు ఊడదీస్తా..! ఇవీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanumantha Rao) చేసిన సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) లేకుండానే ఈసారి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన జరిగింది. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాపై అక్కడి నుంచి స్పందించారు.
ఏ దేవుడి దయతోనే చివరి నిమిషంలోనైనా టికెట్ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతోపాటు ఆయన అనుచరులకు భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది.
పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు..
ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సీఎం కేసీఆర్ ఆశ్చర్యపరిచారు. కేవలం 4 స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. చెప్పినట్టుగా పెద్దగా మార్పులు లేకుండా సిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కేవలం 8 మంది మాత్రమే జాబితాలో చోటు కోల్పోయారు.
రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. పెద్దగా మార్పులేమీ లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 7 మార్పులు చేస్తున్నట్టు తెలిపారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే అభ్యర్థుల తొలి జాబితా (BRS first list) ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ వర్గాల ఉత్కంఠకు తెరపడింది. జాబితా ప్రకటన, సమయంపై అధికారికంగా స్పష్టత వచ్చింది. రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారమే సోమవారమే (ఈ రోజు) బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ అధికారికంగా నిర్ధారించింది.
కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఈసారి కొంత మంది సిట్టింగ్‌లను తప్పిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అసంతృప్తులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అసంతృప్తితో ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ (BRS) సిట్టింగులు, ఆశావహులు ఎంతగానో వేచి చూస్తున్న తొలి అభ్యర్థులకు (BRS First List) సమయం ఆసన్నమైంది. సరిగ్గా 02:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు..