BRS list KTR: బీఆర్ఎస్ తొలి జాబితాపై అమెరికా నుంచి మంత్రి కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

ABN , First Publish Date - 2023-08-21T17:04:21+05:30 IST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) లేకుండానే ఈసారి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన జరిగింది. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాపై అక్కడి నుంచి స్పందించారు.

BRS list KTR: బీఆర్ఎస్ తొలి జాబితాపై అమెరికా నుంచి మంత్రి కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) లేకుండానే ఈసారి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన జరిగింది. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాపై అక్కడి నుంచి స్పందించారు.

‘‘ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి హామీ దక్కిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అభినందనలు. సిరిసిల్ల అభ్యర్థిగా తనను మరోసారి నామినేట్ చేసిన గౌరవనీయ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలి. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న కే.కృష్ణ (కంటోన్మెంట్ టికెట్ ఆశించిన వ్యక్తి), కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. పోటీ అవకాశం తిరస్కరణకు గురైన కృష్ణతోపాటు మిగతావారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే భరోసా లభిస్తుంది. ’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా మొత్తం 115 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ మొదటి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-08-21T17:04:21+05:30 IST