Home » CBI
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షాకు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ ఇంటరాగేషన్ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రౌజ్ అరెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈనెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని కోర్టుకు సీబీఐ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ వీడింది. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జ్యుడీషియల్ కస్టడీలోనే విచారించేందుకు సీబీఐకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. వచ్చే వారం సీబీఐ అధికారులు జైలులో కవితను ప్రశ్నిస్తారు.
కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల బరిలో దిగుతున్నారు. దీంతో ఆమె.. తన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కోరిక తీర్చబోతుందనే ఓ చర్చ అయితే కడప జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది.
ఢిల్లీ హైకోర్టులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ శనివారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వెంటనే విచారించాలని కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని.. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు.