చిన్నాన్న కోరిక తీరుస్తున్న షర్మిల
ABN , Publish Date - Apr 05 , 2024 | 05:27 PM
కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల బరిలో దిగుతున్నారు. దీంతో ఆమె.. తన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కోరిక తీర్చబోతుందనే ఓ చర్చ అయితే కడప జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది.
కడప లోక్‌సభ స్థానం (kadapa lok sabha seat) నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల ( ys sharmila) బరిలో దిగారు. దీంతో ఆమె తన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) కోరిక తీర్చబోతుందనే ఓ చర్చ కడప జిల్లాలోని రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఆయన హత్యకు గురయ్యే ముందు కడప ఎంపీగా నువ్వు బరిలో దిగాలంటూ.. తన చిన్నాన్న వైయస్ వివేకా.. తనను కోరారంటూ వైయస్ షర్మిల వివిధ వేదికల మీద నుంచి పలు సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో కడప వేదికగా చోటు చేసుకున్న తాజా రాజకీయంపై సర్వత్ర ఆసక్తి రేపుతోందనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది.
కడపలో ప్రస్తుత తాజా రాజకీయం గతానికి భిన్నంగా జరుగుతోంది. గతంలో ఏ ఎన్నికలు జరిగినా వైయస్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు లేదా ఇద్దరు బరిలో దిగి పోటీ చేసి గెలిచే వారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని వారు చెబుతున్నారు. నేడు ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు వ్యక్తులు... అదీ కూడా రెండు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగడం పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డి బరిలో దిగుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్ షర్మిల పోటీ చేస్తున్నారు. దీంతో కడప రాజకీయం కాక రేగుతోంది. అక్క తమ్ముడు మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం నడుస్తోంది. అదీకాక ఉమ్మడి కడప జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడు గెలిచినా.. ఆ గెలుపు వెనుక వైయస్ వివేకా తెర చాటు మంత్రాంగం ఉండేదనే ఓ ప్రచారం అయితే నడిచేది. ఇదే విషయాన్ని వైయస్ రాజశేఖరరెడ్డి సైతం ఒకానొక సందర్భంలో ఒప్పుకున్నారనే ఓ టాక్ సైతం నేటికి ఉంది.
అయితే గత ఎన్నికల వేళ వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. అదే సమయంలో ఈ హత్యలో నాటి టీడీపీ ప్రభుత్వ పాత్ర ఉందంటూ ప్రతిపక్ష నేత జగన్ వరుసగా ఆరోపణలు గుప్పించారు. వివేకా హత్యలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే తెలిసే లోపే ఎన్నికలు జరగడం... ఆ వెంటనే ఫలితాలు వెలువడడం చక చకా జరిగిపోయాయి.
ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ ఘన విజయం సంధించింది. ఇక వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేతిలోకి వెళ్లడంతో.. ఈ హత్యలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే విషయం బహిర్గతమైంది. అలాంటి వేళ ఉమ్మడి కడప జిల్లాపై పూర్తి పట్టున్న వివేకా మద్దతుదారుల ఓట్లు ఎవరిని గురి చేసుకొని కాచుకు ఉన్నాయనే ఓ చర్చ సైతం సాగుతోంది. దీంతో రేపు జరగనున్న ఎన్నికల్లో విజయం వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైయస్ షర్మిల, టీడీపీ అభ్యర్థి సి. భూపేష్ రెడ్డి (chadipiralla bhupesh reddy)లలో ఎవరిని వరిస్తుందనే ఓ చర్చ అయితే ఉమ్మడి కడప జిల్లాలోని రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది.
మరిన్నీ ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
Vasantha krishnaprasad: టీడీపీ ప్రస్థానంలో తెలుగు యువత దే కీలక భూమిక..
AP Election 2024: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన