MLC Kavitha: కవిత తరుఫున లాయర్ విక్రమ్ వాదనలేంటంటే..
ABN , Publish Date - Mar 16 , 2024 | 01:21 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని.. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ కొద్ది సేపటి క్రితం రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో ప్రారంభమైంది. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని.. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు. తదుపరి విచారణ జరిగే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని చెప్పి, ఉల్లంఘించారన్నారు. మహిళను ఈడీ కోర్టుకు పిలవడానికి సంబంధించి కవిత ఫైల్ చేసిన కేసు పెండింగ్‌లో ఉందన్నారు. ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్‌కు కట్టుబడ లేదన్నారు. కోర్టు ఆర్డర్ లో రికార్డు చేయనప్పటికీ, మీడియాలో ఇది రిపోర్ట్ అయ్యిందన్నారు.
TDP: పరిటాల శ్రీరామ్ కోసం రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు
అందుకే రికార్డ్స్‌లో లేదు..
"డోంట్ రికార్డ్ ఇట్... మేము అరెస్ట్ చేయబోము" అంటూ అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టులో అన్నారని.. అందుకే రికార్డ్స్‌లో లేదని విక్రమ్ తెలిపారు. అయితే మీడియాలో అది విస్తృతంగా ప్రసారి జరిగిందన్నారు. నిన్న కేసు విచారణకు మరోసారి వచ్చిందని, విచారణ సందర్భంగా జరిగిన వాదనలను జడ్జి నాగపాల్ కు వివరించిన విక్రమ్ సర్వోన్నత న్యాయస్థానం కు అండర్ టేకింగ్ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉండాలి కానీ, కోర్టులో ఒక విషయంపై అండర్ టేకింగ్ ఇచ్చి వాళ్లే దాన్ని ఉల్లంఘించారన్నారు. ఈడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహకరించారని విక్రమ్ అన్నారు. విచారణకు హాజరయ్యారు.. అయినా కవితని అక్రమంగా అరెస్ట్ చేశారని విక్రమ్ కోర్టురు తెలిపారు.
YSRCP Candidates List: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఔట్
ఆ తర్వాత కొద్దిసేపటికే...
కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ సమన్లు జారీ చేశారన్నారు. కవిత వేసిన పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. కవితకి వచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందని విక్రమ్ తెలిపారు. నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి అయ్యి.. కేసు వాయిదా పడిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే... తెలంగాణలో కవిత నివాసంలో సోదాలు నిర్వహించారని విక్రమ్ తెలిపారు. సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. గతంలో 160 సెక్షన్ కింద సీబీఐ 8 గంటలు విచారణ చేశారన్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఐఏకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని.. వాటిలో అన్ని విధాలుగా రిలీఫ్ ఇచ్చారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడీ ఉల్లంఘించిందని విక్రమ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.