Home » Chandrababu arrest
వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టుల నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమ అరెస్ట్, ఇతర కేసులకు సంబంధించి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్లు విచారణకు రానున్నాయి. కీలకమైన తీర్పులు వెలువడతాయని అంచనాలున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఆరోగ్యంగా ఉన్నారని.. ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసగా గాంధీ జయంతి రోజున టీడీపీ పిలుపు మేరకు చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్ష ముగిసింది. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘సత్యమేవ జయతే దీక్ష’ను విరమించారు.
భాగ్యనగరం హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిదేనని సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు.
ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసగా ఎన్టీఆర్‌భవన్‌లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు.
స్కిల్ డెవల్‌మెంట్ కేసులో (Skill development case) అక్రమ అరెస్ట్ నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu arrest) పెద్దఎత్తున మద్ధతు లభిస్తోంది. అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాలని పార్టీ తీసుకున్న నిర్ణయానికి నందమూరి సుహాసిని మద్ధతు ప్రకటించారు.
మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకెపుడు బయటకు వస్తారు? ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలో కూడా అనేక మంది నోటి నుంచి ఇదే ప్రశ్న వినిపిస్తోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగం ..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు.