Nara Chandrababu - Lokesh Live Updates: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కీలక నిర్ణయం.. విచారణ వాయిదా...

ABN , First Publish Date - 2023-10-03T11:39:06+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టుల నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమ అరెస్ట్, ఇతర కేసులకు సంబంధించి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్లు విచారణకు రానున్నాయి. కీలకమైన తీర్పులు వెలువడతాయని అంచనాలున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

Nara Chandrababu - Lokesh Live Updates: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కీలక నిర్ణయం.. విచారణ వాయిదా...

Live News & Update

  • 2023-10-03T14:02:00+05:30

    • 2021 డిసెంబర్ 9న ఎఫ్‌ఐఆర్ నమోదైందని తెలిపిన హరీష్ సాల్వే..

    • సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా.. అన్ని కేసులకు వర్తిస్తుందా అని అడిగిన జస్టిస్ బేలా త్రివేది.

    • అన్ని కేసులకూ వర్తిస్తుందన్న హరీష్ సాల్వే

    • చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఒక్క ఆధారం చూపించలేకపోయింది: మనుసింఘ్వి

    • ఒకదాని వెంట ఒకటిగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు: సాల్వే

  • 2023-10-03T13:48:00+05:30

    • చంద్రబాబు తరుపున వాదనలు వినిపించిన లాయర్లు లుథ్రా, సాల్వే, సింఘ్వి

    • చంద్రబాబుకు 17ఏ వర్తించదు. 2018లో 17ఏ సవరణ జరిగింది. ఈ నేరం అంతకుముందే జరిగింది. వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: ముకుల్ రోహత్గీ

    Untitled-7.jpg

  • 2023-10-03T13:26:00+05:30

    విచారణ సోమవారానికి వాయిదా...

    • స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్ట్ ధర్మాసనం.

    • హైకోర్టులో దాఖలు చేసిన అన్ని డాక్యుమెంట్స్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం

    • చంద్రబాబు జైలులో ఉన్నారు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరిన న్యాయవాది లుథ్రా..

    • అయినప్పటికీ విచారణకు ఈ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్ట్

  • 2023-10-03T13:05:00+05:30

    హైకోర్ట్ తీర్పులో 17ఏ ను తప్పుగా అన్వయించారు: హరీష్ సాల్వే

    చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది: హరీష్ సాల్వే

    బాబు ఆదేశాలతో అధికార విధుల్లో భాగంగా ఇచ్చినట్లు హైకోర్ట్ తీర్పులో పేర్కొన్నారు. హైకోర్ట్ తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి: హరీష్ సాల్వే

  • 2023-10-03T12:45:00+05:30

    చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం విచారణ ప్రారంభం..

    1. విచారణ జరుపుతున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం

    2. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

    3. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని వాదిస్తున్న ఆయన తరపున వాదిస్తున్న హరీష్ సాల్వే

    4. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సిద్ధార్థ్ లూత్రా, హరీశ్ సాల్వే తదితర ప్రముఖ న్యాయవాదులు

    5. కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైన ఏపీ ప్రభుత్వం

    6. తన వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు వినతి

  • 2023-10-03T12:30:00+05:30

    Untitled-3.jpg

    చంద్రబాబు పిటిషన్‌పై కాసేపట్లో సుప్రీంలో విచారణ

    • విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం

    • జాబితాలో చిట్టచివరి కేసు (63వ నెంబర్)గా చంద్రబాబు కేసు

    • ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

    • గతవారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు

    • విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి

    • అదే రోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావన

    • మరో బెంచ్ కేటాయించి అక్టోబర్ 3న విచారణ చేపట్టనున్న తెలిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్

    • అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని వాదించనున్న ఆయన తరఫు న్యాయవాదులు

    • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సిద్ధార్థ్ లూత్రా, హరీశ్ సాల్వే తదితర ప్రముఖ న్యాయవాదులు

    • కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైన ఏపీ ప్రభుత్వం

    • తన వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు వినతి

  • 2023-10-03T12:19:00+05:30

    Untitled-5.jpg

    చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు: ఎమ్మెల్యే చినరాజప్ప..

    అక్రమ కేసులో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. దైర్యంగా ఉన్నారని, కార్యకర్తలను దైర్యంగా ఉండమని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా జగన్ కుయుక్తులు పన్నుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రం కోసమే చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. బండారు సత్యనారాయణను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఇబ్బందిపెడుతున్నారని చినరాజప్ప మండిపడ్డారు. జనసేన, టీడీపీ పొత్తుపై ఉమ్మడి కార్యాచరణతో వెళ్ళాలని చంద్రబాబు చెప్పారని వివరించారు.

  • 2023-10-03T11:59:00+05:30

    మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ పొడిగింపు

    రాజధాని అమరావతి అసైన్ భూముల వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన కేసుల్లో మాజీ మంత్రి నారాయణకు (Narayana) ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు (AP Highcourt) పొడిగించింది. నారాయణతో పాటు మరికొంతమంది కొనుగోలుదారులకు కూడా నేటితో ముందస్తు బెయిల్ గడువు ముగియనుంది. ఈ కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు రాగా.. తమకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీంతో హైకోర్టు కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబీ, మరికొందరు నారాయణ సంస్థల ఉద్యోగులకు కూడా ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

  • 2023-10-03T11:55:00+05:30

    అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

    • హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు

    • పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని చెప్పిన ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది.

    • హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున జోక్యం చేసుకోమని చెప్పిన సుప్రీం ధర్మాసనం

  • 2023-10-03T11:44:00+05:30

    చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్..

    స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఎమ్మెల్యే చినరాజప్ప ములాఖత్ అయ్యారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ, అలాగే భవిష్యత్ కార్యచరణపై సైతం వీరు చర్చించనున్నట్టు సమాచారం. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై వీరికి చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ నేడు చంద్రబాబుకు బెయిల్ రాకుంటే తదుపరి కార్యచరణ ఏంటన్న దానిపై చంద్రబాబు భువనేశ్వరి, బ్రాహ్మణిలకు దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

  • 2023-10-03T11:40:00+05:30

    Untitled-4.jpg

    ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్...

    ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్‌ లంచ్ మోషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులో నిబంధనలు సవాల్ చేస్తూ హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఊరట దక్కిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దంటూ సీఐడీని ఆదేశించింది.

  • 2023-10-03T11:35:00+05:30

    వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టుల నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమ అరెస్ట్, ఇతర కేసులకు సంబంధించి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్లు విచారణకు రానున్నాయి. కీలకమైన తీర్పులు వెలువడతాయని అంచనాలున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.