Satyagraha Deeksha: చంద్రబాబు, భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2023-10-02T11:11:03+05:30 IST

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు.

Satyagraha Deeksha: చంద్రబాబు, భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష ప్రారంభం

రాజమండ్రి: స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు (Chandrababu Naidu Arrest) నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు. అంతకుముందే ఢిల్లీలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు సత్యగ్రహ దీక్షలో కూర్చుకున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.


తెలుగు తమ్ముళ్ల దీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళగిరిలో సత్యమేవ జయతి పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu), పట్టాభి (Pattabhi), వర్ల రామయ్య (Varla Ramaiah) దీక్షలో కూర్చున్నారు. ముందుగా మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి అనంతరం టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. దీక్షకు పలువురు న్యాయవాదులు స్వచ్ఛందంగా మద్దతు పలికారు.

అటు గుంటూరు జిల్లా పలువురు నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. కొల్లిపరలో మాజీ మంత్రి ఆలపాటి రాజా దంపతులు (Former Minister Alapati Raja) నిరహార దీక్షకు దిగా.. మూల్పూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Former Minister Nakka Anand babu), పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర (Former MLA Dhulipalla Narendra), గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర (Kovelamudi Ravindra), గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్ నసీర్ (Nazeer) నిరహార దీక్షకు కూర్చున్నారు.

Updated Date - 2023-10-02T11:23:23+05:30 IST