Home » Chandrababu
తెలుగు ప్రజల ఆత్మబంధువు అన్న ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయన్నారు.
కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 150మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ ముఖ్య నేత బుద్దా వెంకన్న కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలన్నారు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో కూటమికే ప్రజలు పట్టం కట్టారని.. 130 స్థానాల్లో విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. కీలక వ్యాఖ్యలు చేశారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తార ని
డీబీటీ పథకాలకు నిధుల విడుదల తక్షణం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్‌కు లేఖ రాశారు. సంక్షేమ పథకాల కోసం కేటాయించిన సొమ్మును కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు వాడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు లేఖలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు లేఖపై గవర్నర్ వెంటనే స్పందించారు. చంద్రబాబు ఫిర్యాదుతో ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు.
ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు.
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
Andhrapradesh: మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మే 13వ తేదీన పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాశారు.
నేడు కాకినాడ సిటీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడలో పర్యటన కోసం నెల క్రితం పర్మిషన్ అడిగినా కూడా పోలీసులు ససేమిరా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటన ఉందని పవన్‌కు నో చెప్పారు. రోజంతా పోలీస్ స్టేషన్లో పవన్ పర్యటనకు పర్మిషన్ కోసం మాజీ ఎమ్మెల్యే ఒకరు పడిగాపులు కాసినా కూడా ఫలితం దక్కలేదు.