Share News

AP Cabinet: మంత్రివర్గంలో యువశక్తి.. ముందే చెప్పినట్లు..

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:24 AM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గతానికి భిన్నంగా ఈసారి మంత్రివర్గాన్ని చంద్రబాబు నియమించారు.

AP Cabinet:  మంత్రివర్గంలో యువశక్తి.. ముందే చెప్పినట్లు..
AP Ministers

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గతానికి భిన్నంగా ఈసారి మంత్రివర్గాన్ని చంద్రబాబు నియమించారు. యువశక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఓవైపు అనుభవానికి ప్రాధాన్యత ఇస్తూనే.. యువతకు సమాన అవకాశాలు కల్పించారు. సీట్ల కేటాయింపు మొదలు మంత్రివర్గం వరకు ప్రతి విషయంలో యువతకు, మహిళలకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అదే సమయంలో సామాజిక సమతుల్యతను పాటించారు. మంత్రివర్గంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారు. బీసీలకు ప్రయారిటీ ఇచ్చారు. దేశ భవిష్యత్తు యువతదేనని.. తెలుగుదేశం పార్టీలోనూ యువతకు ప్రాధాన్యత ఉంటుందంటూ ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు నాయుడు చెప్పారు. మాటప్రకారం మంత్రివర్గంలో యువతకు అవకాశాలు కల్పించారు. మరోవైపు తనలో కొత్త చంద్రబాబును చూస్తారంటూ ఫలితాల తర్వాత నాయకులతో మాట్లాడుతూ చంద్రబాబు ముచ్చటించారు. ఈక్రమంలో మంత్రివర్గం కూర్పులోనే ఆయన తనదైన మార్క్‌ చూపించారు. అనుభవం, యువశక్తి కలయికతో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. చంద్రబాబు నాయుడు తన ప్రమాణస్వీకారం రోజున పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. మంత్రివర్గంలో బెర్త్‌ల కోసం ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.


అదే లక్ష్యం..

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారున్నారు. కానీ కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లకు, రాజకీయ నేపథ్యంలేని కుటుంబాల నుంచి వచ్చినవాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతో పాటు.. యువత రాజకీయాలవైపు మక్కువ చూపించే విధంగా చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పైరవీలకు తావులేకుండా.. ప్రజలకు సుపరిపాలన అందిచడంతో పాటు.. ప్రజల్లో నిరంతరం ఉండే వ్యక్తులకు మంత్రులుగా ప్రమోషన్ ఇచ్చారు. అదే సమయంలో కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నవారికి సైతం మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు.


ఊహించని ట్విస్ట్‌లు

చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరూ ఊహించని వ్యక్తులకు అవకాశం కల్పించారు. 8 మంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు ఊహించిన దానికంటే మెరుగైన పాలన ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఓ విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో మంత్రివర్గం కూర్పుతోనే రుజువైందనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 12 , 2024 | 11:28 AM