Home » Chandrabau Arrest
‘‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైలుకు పంపారు. స్కిల్ కేసులో ఆయన తప్పు చేశారనడానికి సరైన ఆధారాలు లేవు!’’ – ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒకరు కేంద్ర పెద్దలకు అందజేసిన నివేదికలో...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హస్తిన నుంచి హుటాహుటిన విజయవాడకు బయల్దేరి వచ్చారు. ఢిల్లీ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు (Gannavaram Airport) శనివారం ఉదయం 9 గంటలకు లోకేష్ చేరుకున్నారు. విమానాశ్రయంలో..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం గం. 2.00కు తదుపరి విచారణ జరుగుతుందని కోర్ట్ వెల్లడించింది.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు సంఘీభావంగా ఢిల్లీలో నిర్వహించిన ``కాంతితో క్రాంతి`` కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాల్గొన్నారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) ఖండించారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేడు (గురువారం) కూడా విచారణ వాయిదా పడింది. తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర సంపదను వైసీపీ నేతలు(YCP leaders) దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. నాలుగో విడత వారాహి యాత్ర బుధవారం పెడనకు చేరుకుంది.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై (Chandrababu arrest) స్పందించాల్సిన అవసరంలేదనంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడారు. క్రిమినల్ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు పూర్తవ్వకుండా, కనీసం కోర్టుల్లో కూడా ఎటూ తేలకముందే బాధ్యతాయుత స్పీకర్ పదవిలో ఉండి క్రిమినల్ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నాని(Kodali Nani)కి పడుతుందని... ఎగిరెగిరి, మిడిసి మిడిసి పడమాకండి ఆరు నెలల్లో ఊడిపోయే పదువులు మీవి. అన్ని లెక్కలు తెలుస్తామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను వారంపాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్టి చంద్రబాబు కేసును విచారించడానికి నిరాకరించినప్పటికీ ఏదో ఒక ధర్మాసనం ముందు ఈ రోజే (బుధవారం) విచారణకు వచ్చేలా చూడాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు.