NCBN Health : హుటాహుటిన హస్తిన నుంచి రాజమండ్రికి లోకేష్.. ఏం జరుగుతోంది..!?
ABN , First Publish Date - 2023-10-14T09:45:03+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హస్తిన నుంచి హుటాహుటిన విజయవాడకు బయల్దేరి వచ్చారు. ఢిల్లీ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు (Gannavaram Airport) శనివారం ఉదయం 9 గంటలకు లోకేష్ చేరుకున్నారు. విమానాశ్రయంలో..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హస్తిన నుంచి హుటాహుటిన విజయవాడకు బయల్దేరి వచ్చారు. ఢిల్లీ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు (Gannavaram Airport) శనివారం ఉదయం 9 గంటలకు లోకేష్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra), టీడీపీ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గన రాజమండ్రికి (Rajahmundry) లోకేష్ బయల్దేరి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం (Chandrababu Health) చుట్టూనే ఏపీ రాజకీయాలు (AP Politics) నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో ఏం జరుగుతోంది..? చంద్రబాబు ఆరోగ్యంపై ఒక్కోలా ప్రకటనలు వస్తుండటం, ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ట్విట్టర్ వేదికగా చెప్పడంతో హైటెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో లోకేష్ ఢిల్లీ నుంచి రాజమండ్రికి రావాల్సి వచ్చింది. ఈ విషయంపై టీడీపీ ముఖ్యనేతలతో రాజమండ్రి క్యాంప్ ఆఫీసులో లోకేష్ భేటీ అయ్యి.. ఎలా ముందుకెళ్దాం..? అని నిశితంగా చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అసలేం జరుగుతోంది..?
చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు మొదట్నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు, వైద్యులు, హెల్త్ బులెటిన్‌లో మరోలా చెబుతుండటంతో మరింత ఆందోళన పెరిగింది. మరోవైపు.. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి హడావుడిగా గదిని సిద్ధం చేస్తుండటం ఇదంతా ఏదో అనుమానంగానే ఉందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జైల్లో ఏం జరుగుతోంది..? చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది..? అని తెలుసుకోవడానికి బాబుతో ములాఖత్ అయ్యేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ములాఖత్ విషయమై జైలు అధికారులను నారా ఫ్యామిలీ సంప్రదించింది. ఇందుకే ఢిల్లీ నుంచి హుటాహుటిన లోకేష్ రాజమండ్రికి రావాల్సి వచ్చింది.
ఆస్పత్రికి తరలిస్తారా..?
ఇదిలా ఉంటే.. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి అధికారులు హడావిడి పనులు మొదలుపెట్టారు. ఇదంతా చంద్రబాబు కోసమే అని తెలియవచ్చింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించడానికే ఇలా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆసుపత్రిలో.. అంబులెన్స్, ఇతర వాహనాలు వచ్చి ఆగే స్థలానికి 10 మీటర్లలోపు ఉన్న గదిని సిబ్బంది శుభ్రం చేయడం మొదలు పెట్టారు. ఆసుపత్రి సుపరింటెండెంట్ రాత్రి 10 గంటలు దాటిని తరువాత ఇచ్చిన ఆదేశాల మేరకు సిబ్బంది అప్రమత్తమయ్యారని తెలిసింది. గదిని, వాష్‌రూంని శుభ్రం చేశారు. గదిలో రెండు బెడ్లు వేశారు. ఈసీజీ మిషన్, ఆక్సిజన్ సిలెండర్ వంటి వాటిని సిద్ధం చేసి పెట్టారు. మరోవైపు ఆసుపత్రిలోని అత్యవసర వైద్య సిబ్బంది, వైద్యులు పూర్తి స్థాయి సన్నద్ధతతో అందుబాటులో ఉండాలని సూపరింటెండెంట్ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. సాధారణంగా రాత్రివేళల్లో తెరిచి ఉండే ఆసుపత్రి ప్రధాన గేటును మూసేశారు. దాని పక్కనే ఉండే మరో చిన్న గేటును తీసి పెట్టారు. మీడియా ప్రతినిధులనూ ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. ఈ మొత్తం వ్యవహారంపై జైలు అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా వారి ఫోన్లు అందుబాటులోకి రాలేదు. కాగా.. అవసరమైతే చంద్రబాబుని ఆసుపత్రికి తరలించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. చంద్రబాబు ఎలా ఉన్నారు..? ఆరోగ్యం, బరువు తగ్గారని వస్తున్న వార్తలపై క్లారిటీ రావాలంటే.. ఇవాళ్టి కుటుంబ సభ్యుల ములాఖత్‌తో క్లారిటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.