Home » Chandrayaan 3
చంద్రయాన్ - 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. భూ కక్ష నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించింది. ఉపగ్రహంలోని ఇంధనాన్ని 28 నుంచి 31 నిమిషాలు పాటు మండించి లూనార్ అర్బిట్‌లోకి శాస్త్రవేత్తలు పంపించారు. చంద్రుని కక్షలోకి చంద్రయాన్ -3 చేరుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం చోటు చేసుకుంది.
అమరావతి: భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్‌ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. అది విజయవంతం కావడంతో ...
శ్రీహరికోట: చందమామపై చెరగని ‘ముద్ర’ వేయడానికి.. అంతరిక్ష ప్రయోగరంగంలో భారత కీర్తి ప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేసే.. స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత పెంచే.. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
నెల్లూరు జిల్లా: భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్‌ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు.
చంద్రుడి గురించి తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేస్తున్న ప్రయత్నాల్లో మూడోదైన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం మరికాసేపట్లో జరగబోతోంది. యావత్తు ప్రపంచం దీనిని ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తోంది.
నెల్లూరు జిల్లా: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మ దేవతకు సోమనాథ్ ప్రత్యేక పూజలు జరిపారు.
ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.