Home » Chittoor
రామకుప్పం(Ramakuppam) మండలం పీఎం తండా(PM Thanda)లో ఏనుగు విధ్వంసం(Elephant Attack) సృష్టించింది. శనివారం రాత్రి ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. రాత్రి వేళ పంట పొలాలను ధ్వంసం చేస్తుండడంతో అక్కడే ఉన్న రైతు కన్నా నాయక్.. గట్టిగా అరుస్తూ దాన్ని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన ఏనుగు.. రైతుపై ఒక్కసారిగా దాడి చేసింది.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..
చిత్తూరు జిల్లాలో షర్మిల ప్రచార సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేదని తాజా ఎన్నికలు నిరూపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓట్లు పెరగడం తప్ప ఏ నియోజకవర్గంలోనూ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ధులకు దక్కలేదు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy)కి ఎట్టకేలకు సెలవు మంజూరు అయ్యింది. ఈనెల 11నుంచి 17వరకు సెలవు ఇస్తూ సీఎస్ నీరబ్ కుమార్ (CS Nirabh Kumar) ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో తిరుమల వదిలి వెళ్లవచ్చని కానీ రాష్ట్రం వదిలి వెళ్లవద్దంటూ సీఎస్ ఆదేశించారు.
చిత్తూరు: గాంధీ విగ్రహం సెంటర్లో తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
రాజులపాలెం మండలం ఏర్పేడు సీఎంఆర్ అల్యూమినియం కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తూ ఒక్కసారిగా గ్యాస్ లీక్(Gas leak) కావడంతో సుమారు 30మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 25మంది మహిళలు ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో వైసీపీ మూకల దాడులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులపై వేటు వేసింది. అయితే ఈవీఎం, వీవీప్యాట్ పగలకొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకపోవడంతో తమను ఎవరూ ఏం చేయలేరనే భావం వైసీపీ అల్లరి మూకల్లో బాగా పెరిగింది. దీంతో గన్నవరం నియోజకవర్గం సహా రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూటమి శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు.
తిరుపతి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం తిరుమల రానున్నారు. ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు రేణిగుంటకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.
చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల పరిధిలోని పల్లెలు పోటెత్తాయి. జన చైతన్యంతో ఓటర్లు పోటెత్తారు. 95 శాతానికిపైగా ఓటింగ్ నమోదు చేసి ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఒక గ్రామంలోనైతా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదయింది. దీంతో ఈ పల్లెలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాయి?. ఏ పార్టీని గెలిపించబోతున్నాయి? అంటూ పార్టీలు వణికిపోతున్నాయి. మరి ఏయే నియోజకవర్గాల పరిధిలో గ్రామాల్లో భారీ ఓటింగ్ నమోదయిందో గమనిద్దాం..
వేట కత్తి చూపి షాపు యజమానిని బెదిరించి ఓ గ్యాంగ్ ఐస్ క్రీమ్లు దొంగిలించింది. ఈ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం పట్టణంలో చోటు చేసుకుంది.