Home » Chittoor
జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్‌కాల్స్ వెల్లువెత్తుతున్నాయి..
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అధికార వైసీపీ(YSRCP) అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీ నేతలపై కుట్రకు పన్నింది. ఇందులో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుగా ఉన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav)పై పోలీసులను ఉసిగోల్పుతున్నారు.
ఏపీలో వైసీపీ (YSRCP) నేతలు ప్రజలను, ప్రతిపక్షాలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఏపీలో లేదా అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా అని ప్రశ్నించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు (Chittoor) జిల్లాలో మరోసారి అరాచకాలు, అలజడులు సృష్టించడానికి వైసీపీ ప్లాన్ చేసింది. జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అధికార పార్టీకి బలంగా ఉన్న ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డారు.
Andhrapradesh: తిరుమలలో కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సన్నిధిలో ప్రచారం మహా భాగ్యమన్నారు. ఐదేళ్లలో తిరుమలను కలుషితం చేశారని మండిపడ్డారు.
పోలింగ్‌కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రచార పర్వంలో టీడీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అయిన నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తూ ప్రచారం చేస్తున్నారు.
Andhrapradesh: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన ప్రచార శ్రేణులపై కర్రలతో దాడులు పాల్పడ్డారు. తమ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరింపులుకు దిగారు.