YSRCP Attack: మరోసారి రెచ్చిపోయిన పెద్దిరెడ్డి అనుచరులు.. వేట కొడవళ్లతో..
ABN , Publish Date - Apr 12 , 2025 | 09:50 PM
టీడీపీ సానుభూతిపరులు కన్యాకుమారి కుటుంబంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం దాడికి తెగబడింది. రాళ్లు, వేట కొడవళ్లతో హరినాథ్, వెంకటేశ్, కన్యాకుమారిపై విచక్షణారహితంగా రెచ్చిపోయారు.

చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఘటన మరవకముందే పెద్దిరెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. హత్యకు గురైన రామకృష్ణ బంధువులపై దాడి చేశారు. టీడీపీ సానుభూతిపరులు కన్యాకుమారి కుటుంబంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం దాడికి తెగబడింది. రాళ్లు, వేట కొడవళ్లతో హరినాథ్, వెంకటేశ్, కన్యాకుమారిపై విచక్షణారహితంగా రెచ్చిపోయారు.
ఇంటిపై దాడి చేసి వెంట పడి మరీ నరికేశారు పెద్దిరెడ్డి అనుచరులు. బాధితులకు తీవ్రగాయాలు కాగా.. వారిని కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి, అనుచరుల అరాచకాలపై జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. అనుచరులను ఉపయోగించుకుని తనకు ఎదురు నిలిచిన వారిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం పెద్దిరెడ్డి చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అతని అండతోనే అనుచరులు సైతం పేట్రోగి పోతున్నారని, సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు.
రామకృష్ణ హత్య..
కాగా, పుంగనూరు మండలం కృష్ణాపురంలో మార్చి 15న టీడీపీ కార్యకర్త రామకృష్ణను ప్రత్యర్థులు హత్య చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్త వెంకటరమణ కొడవలితో అతి కిరాతకంగా రామకృష్ణని నరికి చంపాడు. రామకృష్ణ కుమారుడు సురేశ్‌ని సైతం తీవ్రంగా గాయపరిచాడు. తొలుత గాయపడిన వారిని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రామకృష్ణ పరిస్థితి విషమించడంతో తిరుపతికి రుయాకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అప్పటికి 24 గంటలు గడవకముందే కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య జరిగింది. దీంతో రామకృష్ణ మర్డర్ వ్యవహారం సంచలనంగా మారింది. కాగా, తాజాగా అదే కుటుంబానికి చెందిన బంధువులపై పెద్దిరెడ్డి అనుచరులు మళ్లీ దాడి చేయడం కలకలం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..