Home » CM Jagan
వైసీపీ (YSRCP) ప్రభుత్వం వల్ల ఉద్యోగ సంఘాలు చాలా నష్టపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) అన్నారు. ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి రూ. 500 కోట్లను వైసీపీ ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపించారు.
సీఎం, వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN) మేనమామ, వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) నోరు జారారు. ఆదివారం ఆయన తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని నోరుజారారు.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది.
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగింది. పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ చేయించేందుకు ఎత్తుగడ వేసింది. రెండవ సారి సస్పెన్షన్‌ను క్యాట్ కొట్టివేసింది. వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి ఏబీ ఇచ్చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైల్‌ను ఎలక్షన్ కమిషన్‌కు పంపాలని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Andhrapradesh: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్‌కు రూ. 40 వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు.
Andhrapradesh: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ క్యాబినేట్లో ఉన్న 40 మంత్రలు ఓడిపోతున్నారని.. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు.
విశాఖపట్నం: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని, విజయవాడలో సీఎం జగన్ ఐప్యాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటికు వచ్చి ఏడవలేక నవ్వుతూ మొత్తం, గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమమహేశ్వరరావు అన్నారు.
Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్‌ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీసీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలా జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘ జున 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.