Share News

AP Elections: సీఎం వైఎస్ జగన్‌పై.. జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 19 , 2024 | 12:23 PM

విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

AP Elections: సీఎం వైఎస్ జగన్‌పై.. జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖ (Visajga)లో మీడియా (Media)తో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లడమేమిటని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రంలో ఉండాలని.. శాంతి భద్రతలను కాపాడవలసింది ముఖ్యమంత్రి, ఆయన మంత్రులేనని అన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం గర్హనీయమన్నారు. పగలు, ప్రతీకారాలతో రాజకీయ పార్టీలు.. పగ తీర్చుకోవడం సిగ్గుతో తలదించుకోవలసిన విషయమన్నారు.


ఏదీ 144 సెక్షన్..?

రోడ్ల మీద రాడ్లు పట్టుకొని దండయాత్రలు చేయడం మనం లైవ్‌లో చూశామని, ఆయా పార్టీల నేతలు దాడులను నియంత్రించలేక పోయాయని జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. పోలింగ్ రోజున144 సెక్షన్ అయితే ఉంది.. కానీ ఎక్కడా అమలు కాలేదన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు డబ్బే ప్రధానంగా జరిగాయని.. డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టారన్నారు. జూన్ 4 న కౌంటింగ్ ఉందని.. ఆ రోజు కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అల్లర్ల ఘటనలపై సిట్ కూడా త్వరగా విచారణ జరిపి ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న..

క్రీడాకారునికి రూ. లక్ష ఆర్థికసాయం చేసిన పారిశ్రామికవేత్త

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 12:46 PM