Share News

AP Elections 2024:నీలి మీడియాలో నిత్యం అబద్ధాలు రాసున్నారు.. వాటిపై చర్యలేవీ: పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - May 20 , 2024 | 06:35 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections 2024) ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.

AP Elections 2024:నీలి మీడియాలో నిత్యం అబద్ధాలు రాసున్నారు.. వాటిపై చర్యలేవీ: పల్లా శ్రీనివాసరావు
Palla Srinivasa Rao

విశాఖపట్నం: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections 2024) ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. బర్మా క్యాంప్ బాధితులు తమ బాధను చెబితే తప్పు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు.

కూటమి అభ్యర్థులకు ఓటు వేశారని వైసీపీ నేతలు పలువురిపై దాడులు చేశారని విరుచుకుపడ్డారు. బర్మా క్యాంప్ బాధితులకు అండగా నిలిచిన నేతల మీద, మీడియా ప్రతినిధులపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


నీలి మీడియాలో నిత్యం అబద్ధాలు రాస్తున్నారని.. మరి ఆ వార్తలపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? అని నిలదీశారు. పోలీసులు వైసీపీ ముసుగు తీసి..బాధితులకు అండగా నిలవాలని కోరారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్ర బాబుపై గతంలో దాడి జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విశాఖలో అడ్డుకున్నప్పుడు ఎవరికీ నోటీసులు ఇచ్చారు? ఎవరిపై ఏం చర్యలు తీసుకున్నారు? అని నిలదీశారు.


తన మీద జగన్ ప్రభుత్వం ఎన్నో తప్పుడు కేసులు పెట్టింది... అయినా కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తన భార్య లావణ్య దేవిని కక్ష కట్టి సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి విద్యావంతుడు కాదు.. అక్షరాస్యుడని ఆరోపించారు. తన భార్య ఎలాంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేయకపోయినా ఎందుకు సస్పెండ్ చేశారని పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 06:49 PM