Home » Congress 6 Gurantees
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాంగ్రెస్ (Congress) అంటేనే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు.
తమ ప్రభుత్వం ఉండదంటావా లాగులో తొండలు వేసి నల్గొండ బిడ్డలతో కొట్టిపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు భువనగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అభివర్ణించారు. ఆదివారం నాడు గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చరిత్ర.. ఆయన రాజకీయం మీద బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పెండింగులో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్‌తో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్‌లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని.. .పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రేవంత్ వేదికపైకి వచ్చే క్రమంలో పెద్ద పెట్టున నినాదాలతో సభ మార్మోగింది. సీతక్క ప్రసంగానికి రాగానే ఈలలు, కేకలతో సభ హోరెత్తింది.