Seethakka: మోదీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది
ABN , Publish Date - Apr 19 , 2024 | 07:17 PM
మోదీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రేవంత్ వేదికపైకి వచ్చే క్రమంలో పెద్ద పెట్టున నినాదాలతో సభ మార్మోగింది. సీతక్క ప్రసంగానికి రాగానే ఈలలు, కేకలతో సభ హోరెత్తింది.
మహబూబాబాద్: మోదీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రేవంత్ వేదికపైకి వచ్చే క్రమంలో పెద్ద పెట్టున నినాదాలతో సభ మార్మోగింది. సీతక్క ప్రసంగానికి రాగానే ఈలలు, కేకలతో సభ హోరెత్తింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... సీఎం రేవంత్ గ్యారంటీలకే గ్యారంటీ అని తెలిపారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని చెప్పారు.
CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు
గాడ్సే-గాంధీ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో నేటి గాంధీ రాహుల్ గాంధీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పేదల కష్టాలు తీర్చే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. దేవుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండే అగర్ బత్తిపైనా మోదీ పన్నులు వేశారని మండిపడ్డారు.గాంధీ కుటుంబానికి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.బలరాంనాయక్ గెలిస్తే కేంద్రమంత్రి కావడం ఖాయమని మంత్రి సీతక్క జోస్యం చెప్పారు.
TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు
ఆ గోతిలో వారే పడతారు: మంత్రి తుమ్మల
100 రోజుల్లోనే తెలంగాణ పాలనను ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు. సీఎం పదవి కోసం బీఆర్ఎస్, బీజేపీ గోతికాడ నక్కలా కాచుకొని ఉన్నాయని.. ఆ గోతిలో వారే పడిపోవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
TS Politics: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?
కేసీఆర్‌కి మంత్రి పొంగులేటి వార్నింగ్
వరంగల్ మిరపకాయ అంటే ఎంటో రేవంత్ రెడ్డికి తెలుసునని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. సమయం వచ్చినప్పుడు అది ఎక్కడ పెట్టాలో రేవంత్ రెడ్డికి తెలుసునని కేసీఆర్‌ని హెచ్చరించారు. కేసీఆర్ జాగ్రత్తా... రేవంత్‌ను లిల్లిఫుట్‌తో పోలుస్తావా అని వార్నిగ్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్‌కు దమ్ముంటే గతంలో మీరు గెలిచిన నాలుగు సీట్లు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
Congress: రైతుల రుణమాఫీ ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...