Share News

Jaggareddy: శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే..

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:21 PM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అభివర్ణించారు. ఆదివారం నాడు గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చరిత్ర.. ఆయన రాజకీయం మీద బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Jaggareddy: శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే..

హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అభివర్ణించారు. ఆదివారం నాడు గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చరిత్ర.. ఆయన రాజకీయం మీద బీజేపీ (BJP) నేతలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చుట్టే తిరుగుతున్నాయని బీజేపీ నాయకులకు స్పష్టంగా చెబుతున్నానని అన్నారు. రాహుల్ గాంధీకి, మోదీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు.


Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు

బీజేపీ నేత ఎల్కే అద్వానీ రథయాత్రకి ముందు దేశానికి, గుజరాత్‌కి మోదీ ఎవరో కూడా తెలియదన్నారు. అద్వానీ రథయాత్ర పూర్తి అయ్యాక.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోదీ గెలిచిన తర్వాత అద్వానీ సీల్డ్ కవర్‌లో సీఎంగా మోదీని ప్రకటించారని గుర్తుచేశారు.

ఆ సమయంలో మోదీ సీల్డ్ కవర్ గుజరాత్ సీఎం అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మోదీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చాలా రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్‌లో డిసైడ్ చేశారన్నారు. కానీ సీఎంలను డిసైడ్ చేసే రాహుల్ గాంధీకి.. సీల్డ్ కవర్ సీఎం మోదీకి చాలా తేడా ఉందని చెప్పారు.


Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

మోదీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని ఎద్దేవా చేశారు. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ అని.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని తెలిపారు. పేదల కోసం రాముడు పాలన చేశారని.. అయోధ్య గుడి నిర్మిస్తే తాను సంతోషిస్తానని రాముడు అన్నారా అని ప్రశ్నించారు.


Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్‌ ఆటలు సాగనివ్వను...

బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు రాజకీయంగా బతకాలంటే.. జై శ్రీరామ్ అనకతప్పదని అన్నారు. రామాలయ నిర్మాణంతో సమస్యలు పోయాయా అని ప్రశ్నించారు.

రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పారు. గుళ్లు కడితే ఉద్యోగాలు వస్తాయా.. యువత ఆలోచించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.


Hyderabad: రూ.40 వేలేనా.. ఇంకేం లేదా?!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 06:17 PM