Home » CP Sreenivasa Reddy
లంచాలు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడినట్టు రుజువైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ తీరుమారని అధికారులపై నిఘా పెడతామని వివరించారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన 36మంది సైబర్ క్రిమినల్స్‌ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులను ప్రత్యేక ఆపరేషన్ ద్వారా గుజరాత్లో అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
వరుస ఏసీబీ దాడులు, ఇటీవల అవినీతి ఆరోపణలతో ప్రతిష్ఠ మసకబారుతున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ప్రక్షాళనకు నగర సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి శ్రీకారం చుట్టారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై ర్యాంకు వరకు 81 మందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి(Police Commissioner Srinivas Reddy) సూచించారు. గోల్కొండ బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తొట్టెల ఊరేగింపు ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు కోటలో బందోబస్తును పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్నారు.