Hyderabad CP: మసాజ్ సెంటర్లను వదలని ఖాకీలు.. సీపీ వార్నింగ్
ABN , Publish Date - Aug 26 , 2024 | 06:35 PM
లంచాలు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడినట్టు రుజువైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ తీరుమారని అధికారులపై నిఘా పెడతామని వివరించారు.
హైదరాబాద్: లంచాలు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడినట్టు రుజువైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ తీరుమారని అధికారులపై నిఘా పెడతామని వివరించారు. మసాజ్ సెంటర్లు, చిరు వ్యాపారుల, పాన్ షాపుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడొద్దని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి సూచించారు. హైదరాబాద్ పోలీసులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ మేరకు సీపీ స్పందించారు. అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి సర్వీస్ నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అవినీతి ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే పోలీసుల అవినీతి ఆరోపణలపై సీపీ ఘాటుగా స్పందించారు. సస్పెండ్ చేయడం అంటూ ఉండదని, సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.