Share News

Central Crime Station: ‘పంజాగుట్ట’ తరహాలో సీసీఎస్‌ ప్రక్షాళన

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:17 AM

వరుస ఏసీబీ దాడులు, ఇటీవల అవినీతి ఆరోపణలతో ప్రతిష్ఠ మసకబారుతున్న సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ప్రక్షాళనకు నగర సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి శ్రీకారం చుట్టారు. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై ర్యాంకు వరకు 81 మందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

Central Crime Station: ‘పంజాగుట్ట’ తరహాలో సీసీఎస్‌ ప్రక్షాళన

  • కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకు

  • 81 మంది హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌!

  • మరో 16 మందికి స్థానచలనం!

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): వరుస ఏసీబీ దాడులు, ఇటీవల అవినీతి ఆరోపణలతో ప్రతిష్ఠ మసకబారుతున్న సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ప్రక్షాళనకు నగర సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి శ్రీకారం చుట్టారు. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై ర్యాంకు వరకు 81 మందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. మరో 16 మంది కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ స్థాయి అధికారులను సీసీఎస్‌ నుంచి వేరే విభాగాలకు బదిలీ చేశారు. ఇటీవల పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ తరహాలో ఒక్కసారిగా పెద్దఎత్తన ఇంతమంది సిబ్బందిని మార్చడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.


సంచలన కేసులను ఛేదించిన సీసీఎస్‌ ప్రతిష్ఠ ఇటీవల కొందరు అధికారుల తీరువల్ల మసకబారింది. సాహితీ ఇన్‌ఫ్రా కేసు దర్యాప్తులో అవినీతి అరోపణలు ఎదుర్కొన్న ఏసీపీని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం, కొద్దిరోజులకే మరో ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ చిక్కడం సంచలనం సృష్టించాయి. దాంతో సీసీఎ్‌సలో అవినీతి రాజ్యమేలుతున్నట్లు ఆరోపణలు రావడంతో సీపీ శ్రీనివాస్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అంతర్గత విచారణ జరిపించిన సీపీ.. పంజాగుట్ట తరహాలో కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఏఎస్సై వరకు క్షేత్రస్థాయి సిబ్బందిని అక్కడి నుంచి మార్చారు. వారిలో అవినీతి ఆరోపణలు ఉన్న సిబ్బందితో పాటు, లాంగ్‌ స్టాండింగ్‌లో ఉన్నవారూ ఉన్నట్లు తెలిసింది.


  • సిటీలో 48 మంది ఇన్‌స్పెక్టర్లు, 71 మంది ఎస్సైల బదిలీ

హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌లో 48 ఇన్‌స్పెక్టర్లు, 71 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ శ్రీనివాస్‌ రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఉత్తుర్వులు జారీ చేశారు. మరో 10 మంది ఎస్సైలను తాత్కాలికంగా సీసీఎ్‌సకు అటాచ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Aug 11 , 2024 | 03:17 AM