Home » CPI
విశ్వం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటుందని సీపీఐ ( CPI ) తెలంగాణ కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లుకు చేరుతుందని ముందునుంచే చెబుతున్నామని.. అయితే ఆయన దాన్ని మించి 11 లక్షల కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా తీసుకున్నాడని వాటిని ఏం చేశాడో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యం ఏలుతుందా’’ అనే అంశంపై ఆదివారం నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని మోదీ ప్రభుత్వాన్ని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఢిల్లీలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడూ లేదు. వారు చేసిన తప్పేంటి? పార్లమెంట్‌పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారని నారాయణ తెలిపారు.
తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) హామీ ఇచ్చి మరి ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) తెలిపారు.
రాష్ట్రంలో తుఫాన్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.
కొత్తగూడెంను మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆప్ గ్రేడ్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Koonanneni Sambasivarao ) పేర్కొన్నారు.
Andhrapradesh: ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా ఏపీ సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి సీపీఐ తరుపున శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ( CPI Ramakrishna ) వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) ఉమ్మడి ఖమ్మం /జిల్లాలో తమ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాశారు.