Kunamneni: విశ్వం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటది
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:07 PM
విశ్వం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటుందని సీపీఐ ( CPI ) తెలంగాణ కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: విశ్వం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటుందని సీపీఐ ( CPI ) తెలంగాణ కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వార్షికోత్సవ శుభాకాoక్షలు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రకటించుకున్న రోజు అనేక బలిదానాలను, అనేక త్యాగాలను ఎదుర్కొని 99 ఏళ్లుగా ముందుకు నడుస్తున్నాo. 1849 కార్ల్‌మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రూపొందించారు’’ అని కూనంనేని సాంబశివరావు తెలిపారు.
కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు
‘‘రష్యా విప్లవం ప్రపంచానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చింది. బలం ఉన్నోడిదే రాజ్యం కాదు.. శ్రమ పడ్డోడిదే రాజ్యమని కార్ల్‌మార్క్స్ నూతన మార్గాన్ని సూచించారు. ఆ పునాదుల మీదే భారతంలో సీపీఐ ఉద్భవించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే అనేక చట్టాలు, సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. దేశంలో ఔట్ సోర్సింగ్ పేరుతో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. కోట్లాది మంది పేదరికంతో దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్నారు. పాలకుల ప్యారమీటర్స్ పేపర్ల వరకే పరిమితమవుతున్నాయి. ఎర్రజెండా పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేని తెలంగాణలో గెలిచాను. రోజుకొక పార్టీ మారే హీనులు కమ్యూనిస్టుల పార్టీలపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. 99 ఏళ్లలోకి అడుగు పెట్టాం. ఏడాది పాటు కమ్యూనిస్ట్ ఉత్సవాలు జరుకుంటాం’’ అని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.