Home » Cricket
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup2024) భాగంగా న్యూయార్క్ వేదికగా బుధవారం రాత్రి ఐర్లాండ్‌పై సునాయాస విజయం సాధించిన భారత్... T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక విజయాలు సాధించిన రెండవ జట్టుగా భారత్ నిలిచింది.
అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో37 బంతుల్లో 52 పరుగులు బాది రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అయినప్పటికీ సంచలన రికార్డు సృష్టించాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇవ్వబోతున్నాడని.. కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం..
క్రికెట్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. కాసేపు సిక్సులతో అదరగొట్టిన ఓ క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో.. మైదానంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ ఘటన..
చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ సమరం తుది అంకానికి చేరుకోవడంతో.. భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌పై దృష్టి సారించింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా..
చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇన్సింగ్స్ అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించారు. కానీ తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్‌కు చిక్కారు. శర్మతో ఎస్ఆర్హెచ్ వికెట్ల పతనం మొదలైంది. తర్వాత 5 ఓవర్లో రాహుల్ త్రిపాఠిని కూడా బౌల్ట్ వెనక్కి పంపించాడు. అదే ఓవర్లో మార్కమ్‌ను ఔట్ చేశాడు. 5 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు తీశాడు.
టీమిండియా క్రికెటర్, కింగ్ కోహ్లి పలు వ్యాపారాలు పెట్టుబడులు పెట్టారు. సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. క్రికెట్ ఆడుతూనే బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కోహ్లి వాటా ఉన్న వన్ 8 రెస్టారెంట్లు దేశంలో పలు నగరాల్లో ఉన్నాయి. బెంగళూర్, ముంబై, పుణె, కోల్ కతా, ఢిల్లీలో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెస్టారెంట్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఐపీఎల్ (IPL) ట్రోఫీని ముద్దాడాలని కలలు కన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సంచలన రీతిలో ఫ్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేతిలో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. మరోసారి కల చెదరడంతో ఆర్సీబీ ఆటగాళ్లు చెమర్చిన కళ్లు, భారమైన హృదయాలతో మైదానంలో కనిపించారు.
కింగ్ కోహ్లి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పన రన్ మెషీన్.. తాజాగా మరో ఫీట్ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి తప్ప మరే ప్లేయర్ ఇప్పటివరకు ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్- ఆర్సీబీ మధ్య జరుగుతోంది. ఓపెనర్ కోహ్లి 33 పరుగులు చేసి వెనుదిరిగాడు.