IPL 2024: ఆర్సీబీ ఆటగాళ్లని ఉద్దేశించి అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - May 23 , 2024 | 07:08 PM
ఐపీఎల్ (IPL) ట్రోఫీని ముద్దాడాలని కలలు కన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సంచలన రీతిలో ఫ్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేతిలో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. మరోసారి కల చెదరడంతో ఆర్సీబీ ఆటగాళ్లు చెమర్చిన కళ్లు, భారమైన హృదయాలతో మైదానంలో కనిపించారు.
ఐపీఎల్ (IPL) ట్రోఫీని ముద్దాడాలని కలలు కన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సంచలన రీతిలో ఫ్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేతిలో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. మరోసారి కల చెదరడంతో ఆర్సీబీ ఆటగాళ్లు చెమర్చిన కళ్లు, భారమైన హృదయాలతో మైదానంలో కనిపించారు. మరోవైపు ఈసారైనా కప్పు గెలుస్తారని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానుల హృదయాలు మరోసారి బద్దలయ్యాయి. తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లను ఉద్దేశించి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వేడుకలు, దూకుడు స్వభావంతో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరంటూ ఆర్సీబీ ఆటగాళ్లను రాయుడు విమర్శించాడు. కేవలం చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించినంత మాత్రన ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరని, ఐపీఎల్ గెలవాలంటే ప్లేఆఫ్స్‌లో బాగా ఆడాలని వ్యంగ్యాస్ర్తాలు సంధించాడు. ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన అనంతరం ‘స్టార్‌స్పోర్ట్స్’తో మాట్లాడుతూ రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. దీంతో ఐపీఎల్2024 నుంచి ఆర్సీబీ నిష్ర్కమించింది. ఇక క్వాలిఫయర్-2 మ్యా్చ్‌లో రేపు (శుక్రవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
Virat Kohli: ఆర్సీబీని విరాట్ కోహ్లీ వీడాలి.. అప్పుడే అది సాధ్యమవుతుంది
IPL 2024: ఆర్సీబీ ఎలిమినేట్ అయ్యాక అనుష్క శర్మ రియాక్షన్ చూశారా.. పాపం!
For more Sports News and Telugu News