IPL 2024: చేతులెత్తేసిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్
ABN , Publish Date - May 24 , 2024 | 09:25 PM
చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇన్సింగ్స్ అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించారు. కానీ తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్‌కు చిక్కారు. శర్మతో ఎస్ఆర్‌హెచ్ వికెట్ల పతనం మొదలైంది. తర్వాత 5 ఓవర్‌లో రాహుల్ త్రిపాఠిని కూడా బౌల్ట్ వెనక్కి పంపించాడు. అదే ఓవర్‌లో మార్కమ్‌ను ఔట్ చేశాడు. 5 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు తీశాడు.
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ దుమ్ముదూళిపారు. ఒకరు కాకుంటే మరొకరు రెచ్చిపోయారు. 250 పైచిలుకు స్కోరు చేసి మంచి ఊపు తీసుకొచ్చారు. క్వాలిఫైయర్ మ్యాచ్‌లు వచ్చేసరికి చేతులెత్తేశారు. మొన్న క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఈ రోజు గెలిచి నిలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వరసగా ఒక్కొక్కరు పెవిలియన్ చేశారు. ఏ ఒక్కరు ఆశించిన మేరకు రాణించలేదు.
చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇన్సింగ్స్ అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించారు. కానీ తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్‌కు చిక్కారు. శర్మతో ఎస్ఆర్‌హెచ్ వికెట్ల పతనం మొదలైంది. తర్వాత 5 ఓవర్‌లో రాహుల్ త్రిపాఠిని కూడా బౌల్ట్ వెనక్కి పంపించాడు. అదే ఓవర్‌లో మార్కమ్‌ను ఔట్ చేశాడు. 5 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు తీశాడు.
ట్రావిస్ హెడ్ కుదురుకొని ఆడుతున్నారని అనుకునే సమయంలో ఈ సారి సందీప్ శర్మ వంతు వచ్చింది. 14వ ఓవర్‌లో నితీశ్ రెడ్డి కూడా ఇలా వచ్చి అలా ఔటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి అబ్దుల్ సమద్‌ను వెనక్కి పంపాడు. క్లాసెన్ ఒక్కడి మీదే సన్‌రైజర్స్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇలా ఒక్కొక్కరు వరసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరి ఓవర్‌లో షాబాజ్ ఔటయ్యాడు.
ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లరలో క్లాసెన్ ఒక్కడే 50 పరుగులు చేశాడు. త్రిపాఠి 37, హెడ్ 34 పరుగులతో ఫర్లేదు అనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బౌల్ట్, అవేశ్ ఖాన్ తలా 3 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
Read Latest Sports News and Telugu News