Home » Cyber Crime
కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ మహిళ నుంచి రూ. 8.26 లక్షలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్ అవర్(Golden hour)లో ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్)లో, లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.
సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటి మీద హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.
అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులను బురిడీ కొట్టించి రూ.లక్షల్లో కొల్లగొడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్ క్రిమినల్(Cyber criminal)ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో(Balkampeta Yellamma Kalyanam) ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్.జయదేవనాయుడు రూ.50లక్షలు పోగొట్టుకున్నారు. ఈనెల 5న వాట్సాప్ కాల్ చేసిన కేటుగాళ్లు తాము సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ అధికారులమంటూ బిల్డప్ ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని, అరెస్ట్ చేసి జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. తాము పంపే అకౌంట్ నంబర్లకు నగదు బదిలీ చేయాలంటూ.. సుమారు రూ.50లక్షలు తమ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. బెదిరించి.. అయోమయానికి గురిచేసి నిలువునా దోచుకుంటున్నారు. హైదరాబాద్ నాచారంలో నివసించే ట్రాన్స్‌కో రిటైర్డ్ ఉన్నతాధికారి(75) నుంచి ఇలానే ఏకంగా రూ.5 కోట్ల వరకు కాజేశారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి.. అక్కడ సైబర్ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణవాసి మున్సిఫ్ ప్రకాశ్‌కు ఆ చెర నుంచి విముక్తి లభించింది.
మీ పేరున ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షల కాజేశారు.
మీరు ఫేక్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేశారా..? డబ్బులు కూడా తీసుకున్నారా..? సైబర్ కేటుగాళ్ల నుంచి వేధింపులు వస్తున్నాయా..? వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి. వేధింపుల గురించి పోలీసులకు చెప్పండి. ఒక్కసారి ఫిర్యాదు చేశారో చాలు.. మీ కంప్లైంట్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. మీకు వేధింపులు దాదాపుగా తగ్గిపోతాయి. దాంతోపాటు మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.