Share News

Fake Online Loan Apps: సీసీఎస్ పోలీసులను ఎలా ఆశ్రయించాలి..!!

ABN , Publish Date - Jul 02 , 2024 | 08:57 PM

మీరు ఫేక్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేశారా..? డబ్బులు కూడా తీసుకున్నారా..? సైబర్ కేటుగాళ్ల నుంచి వేధింపులు వస్తున్నాయా..? వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి. వేధింపుల గురించి పోలీసులకు చెప్పండి. ఒక్కసారి ఫిర్యాదు చేశారో చాలు.. మీ కంప్లైంట్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. మీకు వేధింపులు దాదాపుగా తగ్గిపోతాయి. దాంతోపాటు మొబైల్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.

Fake Online Loan Apps:  సీసీఎస్ పోలీసులను ఎలా ఆశ్రయించాలి..!!
CCS Police

మీరు ఫేక్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేశారా..? డబ్బులు కూడా తీసుకున్నారా..? సైబర్ కేటుగాళ్ల నుంచి వేధింపులు వస్తున్నాయా..? వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి. వేధింపుల గురించి పోలీసులకు చెప్పండి. ఒక్కసారి ఫిర్యాదు చేశారో చాలు.. మీ కంప్లైంట్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. మీకు వేధింపులు దాదాపుగా తగ్గిపోతాయి. దాంతోపాటు మొబైల్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.


భయపడొద్దు..!!

లోన్ తీసుకుని కట్టినప్పటికీ వేధింపులు తప్పవు. ఒకరి తర్వాత మరొకరు వాట్సాప్ కాంటాక్ట్‌లో చాట్ చేస్తుంటారు. మీ న్యూడ్ ఫొటోలు పెడతామని, ఫ్యామిలీ మెంబర్స్‌కు త్రిపుల్ ఎక్స్ వీడియోలు పంపుతామని మెసేజ్ చేస్తుంటారు. ఆ సమయంలో మీరు భయ పడొద్దు. వెంటనే ఆ చాట్ బ్లాక్ చేయాలి. తర్వాత సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాలి. హైదరాబాద్‌లో సీసీఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. జిల్లా కేంద్రాల్లో సైబర్ పోలీసులు అందుబాటులో ఉంటారు. మీ వేధింపుల గురించి పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది.


ఇలా కంప్లైంట్ చేయండి.

సీసీఎస్‌కు వెళ్లిన తర్వాత రిసెప్షన్‌లో ఉద్యోగి ఉంటారు. అక్కడ పక్కనే గల గోడపై వేధింపులకు సంబంధించి సమాచారం ఉంటుంది. దాని ఆధారంగా మీరు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.


1. టెలిగ్రామ్‌లో జాబ్ అవకాశం పేరుతో మోసం

2. లోన్ యాప్ వేధింపులు

3. కరెంట్ బిల్లు పేరుతో డబ్బులు డ్రా

4. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మోసం

మోసాలకు సంబంధించి పలు రకాలుగా కంప్లైంట్స్ ఉంటాయి. అందులో మీ కంప్లైంట్ ఏంటో చూసి రాయాలి. తర్వాత ఇన్ స్పెక్టర్ వద్దకెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాల్సి ఉంటుంది. అతని సూచన మేరకు ఏసీపీ లేదంటే సీఐ వద్దకు వెళ్లాలి. ఆ సమయంలో ఏ అధికారి అందుబాటులో ఉంటే వారు కంప్లైంట్ తీసుకొని, రిసెప్షన్‌కు రాస్తారు. రిసెప్షన్ వద్దకొచ్చి కంప్లైంట్ కాపీ ఇస్తే సరిపోతుంది. ఓ ఐదు నిమిషాల తర్వాత మీ కంప్లైంట్ ఫైల్ అయినట్టు రిసిట్ ఇస్తారు. తర్వాత ఏం చేయాలో చెబుతారు.


మీ మొబైల్‌లో ఇన్ స్టల్ చేసిన యాప్‌ను సెట్టింగ్స్‌లో యాప్ వద్దకు వెళ్లాలని కోరతారు.

సెట్టింగ్స్

యాప్స్

యాప్ మెనేజ్ మెంట్

ఫేక్ లోన్ యాప్ క్లిక్ చేయాలి

మెనేజ్ పర్మిషన్ నోటిఫికేషన్ డినే చేయాలి.

పర్మిషన్ ఓపెన్ చేయాలి.

కాంటాక్ట్స్

లోకేషన్

ఫోన్

కెమెరా

మైక్రోఫోన్

మ్యూజిక్ అండ్ ఆడియో

ఫొటోస్ అండ్ వీడియో

మెసేజ్

ఒక్కొక్కటి క్లిక్ చేసి డొంట్ అలో చేయాలి. అప్పటి నుంచి మీకు సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్, మెసేజ్ వేధింపులు ఉండవు. దాంతోపాటు ట్రూ కాలర్ యాప్ కూడా ఓపెన్ చేయాలి.


ట్రూ కాలర్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

బ్లాక్ ఓపెన్ చేయాలి

నోటిఫికేషన్ ఫర్ బ్లాక్డ్ కాల్స్

నోటిఫికేషన్ ఫర్ బ్లాక్డ్ మెసెజ్ ఓపెన్ చేయాలి.

హిడెన్ నంబర్స్ బ్లాక్ చేయాలి.

నంబర్స్ ఫ్రం ఫారిన్ కంట్రీస్ బ్లాక్ చేయాలి.

మీ ఫొన్ బుక్‌లో లేని నంబర్ కూడా బ్లాక్ చేయాలి.

ఇలా చేయడంతో మీకు సైబర్ కేటుగాళ్ల నుంచి ఫోన్ రాదు. వాట్సాప్‌లో సేమ్ ఫేక్ లోన్ యాప్ మాదిరిగా పర్మిషన్ తీసివేయాలి. ఫస్ట్ నాలుగు రోజులు నా నంబర్ హ్యాక్ అయ్యిందని స్టేటస్ పెట్టాలి. తర్వాత అన్ ఇన్ స్టాల్ చేయాలి. ఓ 15 రోజులు.. లేదంటే నెల రోజుల తర్వాత మళ్లీ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. 4 నుంచి వారం రోజుల్లోపు సమస్య పరిష్కారం అవుతుంది. ఆ నంబర్ మరి అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే వాడకపోవడం ఉత్తమం. ఆధార్ లింక్, గ్యాస్ లింగ్, ఇతర ప్రయారిటీ ఉంటే మెసేజ్, కాల్స్ చేసుకునేందుకు ఆ నంబర్ ఉపయోగించడం బెటర్.

Also Read: AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?

Also Read: West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు


Read Latest
Telangana News AND Telugu News

Updated Date - Jul 02 , 2024 | 08:57 PM