Home » Danam Nagender
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీకి చెందిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ శాసనసభాపక్షం (బీఆర్‌ఎ్‌సఎల్పీ) త్వరలో కాంగ్రె్‌సలో విలీనం కావడం ఖాయమంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana: త్వరలో బీఆర్ఎస్ఎల్పీ.. కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హిమాయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) సూచించారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మార్పు, చేర్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేదెవరు..? ఉన్న మంత్రుల శాఖల మార్పు గురించి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక అప్ డేట్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కొందరి మంత్రుల శాఖల మారుతాయని తేల్చి చెప్పారు. మంత్రివర్గంలోకి ముగ్గురి నుంచి నలుగురిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
బీజేపీఎల్పీ నేత మహేశ్వర రెడ్డిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సభ్యత్వం రద్దు చేయమని అడిగే అధికారం ఆయనకు లేదన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మహేశ్వర రెడ్డి ఈ రోజు కలిశారు. పార్టీ మారిన దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఇదే అంశంపై దానం నాగేందర్ మాట్లాడుతూ.. తన సభ్యత్వం గురించి మాట్లాడే హక్కు మహేశ్వర రెడ్డికి లేదన్నారు.
బీఆర్ఎస్ నుంచి మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే కాంగ్రెస్ ఓటమి పాలైందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) ఆరోపించారు.
ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రం విలువ ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) ఎద్దేవా వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు అమ్ముకోవాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.