Danam Nagender: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి
ABN , Publish Date - Jan 03 , 2025 | 08:39 AM
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక డివిజన్లను కైవసం చేసుకుని సత్తా చాటాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) పిలుపునిచ్చారు.
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక డివిజన్లను కైవసం చేసుకుని సత్తా చాటాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగిరి తీరాలని, ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్(Khairatabad) జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యేను గురువారం కలిశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యమకారులకు తీరని అన్యాయం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం లక్ష్మణ్ గౌడ్, గడ్డం శ్రీధర్‌గౌడ్, తొలుపునూరి నరే్‌షగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News