Share News

MLA Danam: కనీవిని ఎరుగని రీతిలో విజయోత్సవాలు..

ABN , Publish Date - Dec 04 , 2024 | 08:48 AM

కనీవిని ఎరుగని రీతిలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.

MLA Danam: కనీవిని ఎరుగని రీతిలో విజయోత్సవాలు..

- ఎమ్మెల్యే దానం నాగేందర్‌

హైదరాబాద్: కనీవిని ఎరుగని రీతిలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. బంజారాహిల్స్‌(Banjara Hills)లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: డాన్‌గా ఎదగడానికి ప్రత్యేక డెన్‌ ఏర్పాటు.. చివరకు ఏమయ్యాడంటే..


దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అయితే బీజేపీ చార్జిషీట్‌ పేరిట తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదని ఆయన ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.


ఈ నెల 7న పేదలకు దుప్పట్ల పంపిణీ, అన్నదానాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తామని.. 9న సచివాలయం వద్ద రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు రాములు చౌహాన్‌, అరుణ్‌కుమార్‌, నారికెళ్ల నరేష్‌, శ్రీనివాస్‌, రాజేష్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 04 , 2024 | 08:48 AM