Home » Dasara
దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించిందని శాస్త్రపండితులు పేర్కొంటున్నారు. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువు తీరి ఉన్నారని వారు వివరిస్తున్నారు. శ్రీ మహా చండీ అమ్మ వారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లేనని వారు పేర్కొంటున్నారు.
విజయవాడ కనకదుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకులకు ఫోటో కాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్తు ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. దుర్గ గుడి ఉన్నతాధి అధికారులు వైసీపీ నాయకుడు పోతిన మహేష్‌కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయించారు.
చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కూడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుసుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. కాగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల రాక ప్రారంభమైంది.
శక్తి స్వరూపిణి జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని ఈ జగమంతా అనేకానేక రూపాలలో వుంటుంది. వాటిలో కొన్ని రూపాలకు విశేష చరిత్ర వుంది. మరికొన్ని రూపాలను సాధకులు తమ సాధనలు, కోరికలు త్వరగా ఫలించేందుకు ఎంచుకుని పూజలు చేస్తుంటారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన శనివారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చి కనువిందు చేశారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మదనపల్లె రెండో రోజైన శుక్రవారం వాసవీ కన్యకాపరమేశ్వరి గాయత్రీదే విగా భక్తులకు దర్శనమిచ్చారు.
నవరాత్రుల్లో ముచ్చటగా మూడోరోజు.. అంటే శనివారం అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమైన దుర్గమ్మ. సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు.
అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.58 గంటలకు వస్తుంది. ఆ మరునాడు అంటే.. అక్టోబర్ 13వ తేదీ ఉదయం వరకు ఈ దశమి ఘడియలు ఉన్నాయి. అంటే.. ఆదివారం ఉదయం 9.08 నిమిషాల వరకు ఉంది. ఈ నేపథ్యంలో దశమి ఘడియలు శనివారం ఉదయం ప్రారంభమవుతాయి.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తోంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామ్‌లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర సైతం నిర్వహించనున్నారు.