Share News

Mohan Bhagwat: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 12 , 2024 | 11:12 AM

హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. బలహీనంగా ఉండడమనేది నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన హిందువులకు సూచించారు. మనం బలహీనంగా ఉంటే మాత్రం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడమేనని ఆయన పేర్కొన్నారు.

Mohan Bhagwat: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Mohan Bhagwat

నాగ్‌పూర్, అక్టోబర్ 12: హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. బలహీనంగా ఉండడమనేది నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన హిందువులకు సూచించారు. మనం బలహీనంగా ఉంటే మాత్రం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిందువులు గుర్తించాలన్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ర్యాలీలో చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడారు.

Also Read: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు


nagpur.jpgసమాజంలో విభేదాలు అనేవి ఉండకూడదన్నారు. ప్రపంచదేశాల్లో భారత్ ఖ్యాతి పొందిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారతదేశం వైవిధ్యమైన దేశమని తెలిపారు. ఈ దేశానికి అదే బలమని ఆయన అభివర్ణించారు. కొంత మందికి భారతదేశ పురోగతిపై సమస్యలు ఉన్నాయంటూ ఆయన పరోక్ష విమర్శలు చేశారు. పొరుగునున్న బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులను హింసిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: గాల్లోకి ఎగిరిన బోగీలు


ఆ దేశంలో మైనార్టీ హిందువులపై ప్రమాదపు కత్తి వేలాడుతుందన్నారు. అయితే ఆ దేశంలో హిందూ సమాజం తనను తాను రక్షించుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందుకే కొంత రక్షణ కలిగి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం దీనిని అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో హిందువులంతా ఐక్యంగా ఉండడం చాలా ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Also Read: మీరే నాకు ఆదర్శం..భువనేశ్వరి భావోద్వేగం


ఇక దేశంలోనే కాదు ప్రపంచంలో చోటు చేసుకున్న పలు అంశాలపై ఆయన స్పందించారు. ఆ క్రమంలో కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న సంఘటనతోపాటు ఇజ్రాయెల్ - లెబనాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దంపై సైతం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పును.. మొత్తం సమాజాన్ని బాధ్యులుగా చేయడం మహాపరాధమన్నారు. భారత్ నుంచి మనకు ప్రమాదం పొంచి ఉందనే ఓ విధమైన ప్రచారం బంగ్లాదేశ్‌లో జరుగుతుందన్నారు.

Also Read: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..


అయితే బంగ్లాదేశ్ నిర్మాణంలో భారతదేశం కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. మరి అలాంటి బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా భారత్ ఎలా పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎప్పటికీ అలా వ్యవహారించదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు. అయితే ఈ తరహా కథనాలు చేస్తున్న వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


హిందువులంతా ఐక్యంగా ఉంటే ఇటువంటి వారి ఆటకట్టించవచ్చునన్నారు. పరిస్థితులు కొన్ని కొన్ని సార్లు సవాలుగా ఉంటాయన్నారు. అయితే మానవ జీవితం గతంలో కంటే సుసంపన్నమైనదని తెలిపారు. ఈ సంతోషకరమైన, అభివృద్ధి చెందిన ఈ మానవ సమాజంలో కూడా అనేక సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

For National News And Telugu News..

Updated Date - Oct 12 , 2024 | 11:18 AM