Home » Delhi Excise Policy
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. కవితను అరెస్టు చేసిన రోజున వీరిద్దరి ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత సహాయకుల పాత్రపై క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ నేత, ఎంపీ అర్వింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ ఈడీకి సహకరించాలని అన్నారు. ఈడీ విచారణకు పిలిస్తే.. హాజరు కాకుండా అనిల్ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కింద తనకు ఇంతవరకూ జారీ చేసిన సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరుపనుంది.
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదరయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి..
Supreme Court Verdict On Kavitha Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతోంది. ఇదివరకే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు నుంచి కవిత లాయర్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు..
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు.
MLC Kavitha ED Custody: అవును.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) కాస్త రిలీఫ్ దక్కింది.! వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే..
Kavitha Custody Report: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వరుస షాక్‌లు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈడీ ఇక రంగంలోకి దిగనుంది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది.